cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మార్చి 25న ఒరేయ్ బుజ్జిగా

మార్చి 25న ఒరేయ్ బుజ్జిగా

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో తయారైన సినిమా ఒరేయ్ బుజ్జిగా. ఈ సినిమాకు విడుదల డేట్ ఫిక్స్ చేసారు. మార్చి 25న సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చారు. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రియల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ సినిమాలు వరుసగా బోలెడు వుండడంతో, సమ్మర్ అడ్వాంటేజ్ ను ముందుగా అందుకునే ఆలోచనతో మార్చి 25కు ఫిక్స్ చేసారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ``ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా 'ఒరేయ్ బుజ్జిగా...' ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాజ్‌ తరుణ్‌ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.  మా బేన‌ర్‌లో 'ఏమైంది ఈ వేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్',  'పంతం' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. 

రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు త‌ప్ప‌కుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25 ఈచిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు

 


×