పవన్ కళ్యాణ్ కోసం రానా రంగంలోకి దిగాడు. బాలీవుడ్ లో తనకు వున్న పరిచయాలను వాడి, పవన్ సినిమా అజ్ఞాతవాసిని బయట పడేయాలని రానా ప్రయత్నాలు ప్రారంభించాడట. దీని వెనుక విషయం ఇలా వుంది.
అజ్ఞాతవాసి సినిమా ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు ఫ్రీమేక్ అని మొదట్నించీ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు అయితే ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ అని ట్యాగ్ లైన్ పెట్టారో అప్పటి నుంచీ వ్యవహారం బిగుసుకోవడం ప్రారంభమైంది. ఎందుకంటే లార్గో వించ్ సినిమా ఆల్ ఇండియా లాంగ్వేజెస్ రీ మేక్ రైట్స్ టీ సీరిస్ దగ్గర వున్నాయి. వాళ్లు సరైన సమయం కోసం వెయిట్ చేసారు.
ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన గట్టి లాయర్లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కోసం బాహుబలి నటుడు రానా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీనికి కూడా కారణం వుంది. టీ సీరీస్ అధినేతతో రానాకు మాంచి స్నేహ సంబంధాలు వున్నాయట. పైగా త్వరలో త్రివిక్రమ్ ఓ సినిమాను రానా బాబాయ్ వెంకటేష్ తో చేయబోతున్నారు.
అయితే టీ సీరీస్ వైపు నుంచి ఒకటే మాట వినిపిస్తోందట. సెన్సారు స్క్రిప్ట్ ఇవ్వండి. మేం మా సినిమాతో సంబంధం వుందో లేదో తెల్చుకుంటాం. సంబంధం లేకపోతే ఓకె. వుంటే మాత్రం మేం కొన్న మొత్తం ఇచ్చేసి హక్కులు తీసేసుకోండి అంటున్నారట. కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో హక్కుల మొత్తం అంటే అది ఎన్ని కోట్లు వుంటుందో? అదో సమస్య.
అందుకే రానా ఏదో విధంగా సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. మరోపక్క రాజకీయంగా కూడా రాయబారాలు అందించే ప్రయత్నాలు జరగుతున్నాయట.