అజ్ఞాతవాసి టీజర్ వచ్చింది. కాస్త గ్యాప్ ఇచ్చి కొడుకా కోటీశ్వర్రావా అంటూ పవన్ పాడిన పాట బయటకు వచ్చింది. ఇక సినిమాకు తొమ్మిది రోజులే టైమ్ వుంది. ఈలోగా ఇంకా రెండు ఈవెంట్లు మిగిలి వున్నాయి. ఒకటి బెంగుళూరులో ఫ్యాన్స్ మీట్ లాంటిది నిర్వహించడం. రెండవది ట్రయిలర్ విడుదల.
ఇప్పటి దాకా అజ్ఞాతవాసి ట్రయిలర్ బయటకు రాలేదు. సినిమా రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. చెన్నయ్ లో ఈ పనిలో డైరక్టర్ త్రివిక్రమ్ బిజీగా వున్నారు. అది పూర్తి కాగానే ట్రయిలర్ విడుదల వుంటుందట. మూడవ తేదీ లేదా నాల్గవ తేదీన ట్రయిలర్ విడుదల చేయాలని భావిస్తున్నారు. సెన్సారు పనులు 2017లో ఆఖరి రోజుల్లో అయిపోతాయి అనుకున్నారు.
కానీ సెన్సారు టీమ్ అంతా ఇయర్ ఎండ్ వర్క్ లో బిజీగా వుండడంతో కుదరలేదు. సోమవారం సెన్సారు అధికారులు సినిమాను చూసే అవకాశం వుంది. సోమవారం కనుక సెన్సారు అయిపోతే, బుధవారం ట్రయిలర్ బయటకు వస్తుంది. వన్స్ ట్రయిలర్ బయటకు వస్తే, సినిమా మీద అంచనాలు మరింత పెరుగతాయన్నది గ్యారంటీ.