ఇదేం పిచ్చి ప్రశ్న..సినిమాలు చూట్టం లేదా అనేయకండి తొందరపడి..విషయం అది కాదు.. ఉత్తరాంధ్ర ను అల్లకల్లోలం చేసిన హుద్ హుద్ విలయతాండవానికి జరిగిన నష్టానికి తమ వంతు సాయం చేయడానికి టాలీవుడ్ ముందుకు వచ్చింది. మేము సైతం అని పన్నెండు గంటల కార్యక్రమం ఒకటి తయారు చేసింది.
అన్నపూర్ణ ఏడెకరాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని లైవ్ చేసి, దాని ద్వారా వచ్చే మొత్తాన్ని డొనేట్ చేయాలన్నది సంకల్పం. అయితే పన్నెండు గంటల కార్యక్రమం అంటే చిన్న విషయం కాదు. ఎన్నిపాటలు, ఎన్ని స్కిట్ లు, ఇంకా ఎన్ని..ఎన్ని రకాలు. పైగా అంతమంది నటులు పాల్గొనాలి.
Watch Memu Saitham Promotional Video
అందుకే టాలీవుడ్ లో వున్న చిన్న పెద్ద అందరూ ఏదో ఒక ఈవెంట్ లో పాల్గొనాలని మేము సైతం టీమ్ డిసైడ్ చేసింది. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదంటున్నారు. బన్నీ, రామ్ చరణ్, నాగ్, బాలకృష్ణ లాంటివాళ్లు ఇలాంటి వాటికి హుషారుగానే ముందుంటారు.
మరి మహేష్, పవన్, ఎన్టీ ఆర్ మాత్రం కాస్త తక్కువ. మరి వాళ్లు రావడం సరే, స్టేజ్ పై ఏదైనా పెర్ఫార్మ్ చేస్తారా అన్నది అనుమానంగా వుంది. మేము సైతం టీమ్ కూడా దీని గురించి ఇప్పడేమీ చెప్పలేకపోతోంది. చేస్తారనే ఆశిస్తున్నాం అంటున్నారంతే..నిర్వాహకులు.