చరణ్ దృష్టికి బహద్దూర్

రామ్ చరణ్ మాంచి లవ్ స్టోరీ కోసం చూస్తున్నాడు.. ఆరెంజ్ తరువాత సరైన లవ్ స్టోరీ పడలేదు. అలా అని మాస్ మసాలాలు వదలకూడదు. కన్నడంలో ఆ మధ్య విడుదలై పెద్ద హిట్ అయిన…

రామ్ చరణ్ మాంచి లవ్ స్టోరీ కోసం చూస్తున్నాడు.. ఆరెంజ్ తరువాత సరైన లవ్ స్టోరీ పడలేదు. అలా అని మాస్ మసాలాలు వదలకూడదు. కన్నడంలో ఆ మధ్య విడుదలై పెద్ద హిట్ అయిన సినిమా బహద్దూర్. తోమ్మిది కోట్ల బడ్జెట్ తో తయారై, ఇరవై కోట్లకుపైగా వసూలు చేసిన సినిమా. తెలియని, గొప్ప కథ కాదు. డబ్బున్న అబ్బాయి, తండ్రి మాటకు విలువ ఇచ్చే అమ్మాయిల నడుమ ప్రేమ కథ. 

అయితే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ,. కమర్షియల్ అంశాలు ఇమడ్చడానికి చాలా అవకాశాలు వున్నాయి. అందువల్ల ఈ సినిమాను తెలుగులోకి తెస్తే ఎలా వుంటుందని కొందరు చరణ్ దృష్టికి తీసుకెళ్లారట. దాంతో చరణ్ ఆ సినిమాను చూసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఏ నిర్ణయమూ వెలువడలేదు. అయినా మెగా ఎప్రూవల్ కూడా కావాలి కదా.