మెగా షో పూర్తయింది. లక్షకు పైగా అభిమానుల సందోహం నడుమ పవన్ మినహా మిగిలిన మెగా నటులంతా కొలువు తీరారు. కానీ తన రూటే సెపరేటు..తాను కృష్ణుడిగా కుచేలుడి ఇంటికి వెళ్లే టైపు తప్ప, బలరాముడి ఇంటికి వచ్చే టైపు కాదనుకునే పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు.
పవన్ గైర్ హాజర్ పై అన్న చిరంజీవీ, ఆయన కొడుకు చరణ్ లు మాత్రం చాలా ఫీలయ్యారని అభిమానుల సమచారం. మెగాభిమానులైతే, ఈ విషయంలో తాము పవన్ కళ్యాణ్ ను ఏమాత్రం సమర్థించలేమన్నది అభిమానుల కామెంట్.
నిన్నటి వరకు పవన్ హాజరవుతారనే సమాచారమే చిరు ఫ్యామిలీలో వుందట. పన్నెండు గంటల ప్రాంతంలో కానీ, సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కానీ ఫ్లయిట్ కు బయల్దేరతారనే సమాచారమే వుందట. పైగా పవన్ ఆఫీస్ స్టాఫ్ కూడా ఈ మెగా ఈవెంట్ కు ముందుగా రావడంతో, పవన్ రాక దృష్ట్యానే వారు వచ్చారని అభిమానులు భావించారట.
అప్పటికీ నాలుగు గంటల ప్రాంతంలో చరణ్ స్వయంగా పవన్ వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేసి, బయల్దేరున్నారా లేదా అన్నది వాకబు చేసినట్లు అభిమానుల్లో వినిపిస్తొంది. రూమ్ లో వున్నారని, బయల్దేరతారో లేదో తెలియదని సమాధానంరావడంతో రారని చరణ్ ఫిక్సయ్యారట.
విడియో బైట్ కూడా పంపలేరా?
హాజరు కాకపోతున్నపుడు కనీసం అన్న గురించి ఓ విడియో బైట్ అయినా తయారు చేసి పంపి వుండొచ్చుకదా కళ్యాణ్ బాబు అన్నది అభిమానుల వాదన. జస్ట్ ఓ మెసేజ్ ట్వీట్ చేయడం ఏమిటి? అన్న తో చరణ్ తో తన అనుబంధం తెలిపేలా, ఓ మాంచి విడియో బైట్ వదిల్తే వచ్చిన వ్రత భంగం ఏమిటో తమకుఅర్థం కావడం లేదని మెగాభిమానులు కామెంట్ చేస్తున్నారు. తను వస్తే, బోలెడు మంది వచ్చేస్తారని పవన్ కు ఫీలింగ్ వుంటే వుండొచ్చని, కానీ అప్పటికె ఈ మెగా ఈవెంట్ కు లక్షల మంది వచ్చారని, పోలీసుల సగం మందిని బయట గ్రవుండ్ లోనే ఆపేసారని, పవన్ వస్తే, ఈ సంఖ్య ఇంకా పెరిగిపోతుందని అనుకోవడం సరి కాదని అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ లో ఎక్కువ మంది మెగా ఫ్యాన్స్ కూడా వున్నారని వాదిస్తున్నారు.
మొత్తం మీద ఇన్నాళ్ల సంగతి ఎలా వున్నా, ఇంత కీలకమైన ఫంక్షన్ కు పవన్ డుమ్మా కొట్టడం మాత్రం ఇటు మెగాభిమానులకు, అటు మెగాస్టార్ కుటుంబానికి కొంచెం ఎక్కువ డిస్సపాయింట్ నే కలిగించింది.