Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అన్నా.. భార్యల గురించి అడగొద్దు ప్లీజ్!

 అన్నా.. భార్యల గురించి అడగొద్దు ప్లీజ్!

అన్నపూర్ణ స్టుడియోస్ లో ఏకకాలంలో తమ ఇద్దరి చిత్రాలు షూటింగులు నడుస్తున్నాయి గనుక.. షూటింగ్ గ్యాప్ లో నందమూరి బాలకృష్ణ, జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. వారి సినిమా బృందాలు కూడా ఈ భేటీలో కలిసి కాసేపు సరదాగా గడిపారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న హరిహరవీరమల్లు ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో నడుస్తోంది. అలాగే బాలయ్య చేస్తున్న వీరసింహారెడ్డి షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. దాంతో ఈ సందర్భం ఏర్పడింది. 

ఒక స్టుడియోలో వేర్వేరు సినిమాల షూటింగులు నడుస్తున్నప్పుడు.. ఆ సినిమాల హీరోలు గ్యాప్ లో కలుసుకోవడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటినుంచి ఇలా జరుగుతూనే వస్తోంది. అది ఎప్పుడూ పెద్ద వార్త కానే కాదు.

అయితే.. ఈ సందర్భంలో ఇద్దరు నాయకులు కూడా రాజకీయాల్లో ఉన్నవారు కావడం.. ఇద్దరూ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో ఉన్నవారు కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యం పెరిగింది. పైగా బాలయ్య, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంత సీక్రెట్ ఏముంటుందబ్బా అనే అనుమానం అందరికీ కలగడం సహజం.

నిజానికి ఈ ఇద్దరు స్టార్స్ మరో మూడు రోజుల్లో కలిసి సుదీర్ఘమైన షూటింగ్ లో పాల్గొన బోతున్నారు. ఆహా ఓటీటీకోసం బాలకృష్ణ ప్రయోక్తగా నిర్వహించే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ గెస్టుగా హాజరు కాబోతున్నారు. 27న ఆ షూటింగ్ జరుగుతుంది.ఇద్దరి ఏకాంత సమావేశంలో కూడా దానికి సంబందించిన ముచ్చటే మాట్లాడుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలయ్య తన షోలో అతిథులను ఇబ్బంది పెట్టే వారి ప్రెవేటు సంగతులు కూడా అడుగుతూ.. కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంటారు. వీటిలో కొన్ని అభ్యంతరకరంగా కూడా ఉంటాయి. అతిథుల గురించి ప్రచారంలో ఉండే తీవ్రమైన విమర్శలు, పుకార్లను కూడా ఆయన తన షోలో ప్రస్తావిస్తుంటారు. ఈ భయంతోనే పవన్ కల్యాణ్ బాలయ్యతో ఏకాంతంగా భేటీ అయినట్టు తెలుస్తోంది.

పవన్ కు సంబంధించి.. ఆయన భార్యల్ని తరచూ మారుస్తుంటారని, రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. ఆయన క్షుద్రపూజల గురించి, అందుకోసం అమ్మాయిలను వాడుకోవడం గురించి కూడా ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు. ఇటీవల కూడా జగన్ తన ప్రసంగంలో.. పవన్ కల్యాణ్ ఈ భార్య కాకపోతే మరో భార్య అనుకుంటారని ఎద్దేవా చేశారు.

ఆ నేపథ్యంలో.. అన్ స్టాపబుల్ షోలో.. తన భార్యల ప్రస్తావన తేవొద్దని పవన్ కల్యాణ్ బాలయ్యను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. నిజానికి షోలో అడిగినా.. తర్వాత కూడా ఎడిట్ చేసి తీసేయవచ్చు. కానీ.. ఒకసారి అడిగితే.. అది ఆటోమేటిగ్గా బయటకు లీక్ అవుతుందని, ఆ ప్రశ్నకు తాను సమాధానం చెప్పినా, చెప్పకుండా తప్పించుకున్నా.. పరువు పోవడం మాత్రం గ్యారంటీ అని పవన్ కల్యాణ్ భయపడినట్టు తెలుస్తోంది. అందుకే భార్యల ప్రస్తావన, క్షుద్రపూజల ప్రస్తావన లేకుండా ఇంటర్వ్యూ చేయాలని బాలయ్యను అడిగినట్టు సమాచారం.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా