పవన్ సరసన పిల్ల తల్లి ఎవరు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు అన్నీ బాగానే సమకూరాయి కానీ, ఇంకా హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. పూజా హెగ్డే ను తీసుకుందాం అనుకున్నారు. డైరక్టర్ క్రిష్ చేస్తున్న సినిమా ఒకటి వుంది.…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు అన్నీ బాగానే సమకూరాయి కానీ, ఇంకా హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. పూజా హెగ్డే ను తీసుకుందాం అనుకున్నారు. డైరక్టర్ క్రిష్ చేస్తున్న సినిమా ఒకటి వుంది. దాంట్లో కూడా పవన్ కు హీరోయిన్ కావాలి. అందుకోసం పూజా హెగ్డే పేరు పరిశీలనలో వుంది. క్రిష్ ఆస్థాన హీరోయిన్ ప్రగ్వా జైస్వాల్ ఓ ఆప్షాన్ గా వుండనే వుంది. 

ఆ సంగతి అలా వున్నా పింక్ కు హీరోయిన్ గా ఎవరు సెట్ అవుతారన్న పాయింట్ అలాగే వుంది. కథ ప్రకారం పింక్ రీమేక్ లో హీరోయిన్ ఓ బిడ్డకు తల్లి. మరి బిడ్డకు తల్లి అనే వయస్సు క్యారెక్టర్ ను చేయడానికి ఏ హీరోయిన్ రెడీగా వుందీ అన్నది పాయింట్. ఎంత పవర్ స్టార్ సినిమా అయినా, ఎంత దిల్ రాజు నిర్మాత అయినా, హీరోయిన్లు బిడ్డ తల్లిగా చేయడానికి ఆలోచిస్తారు కదా? పైగా నిడివి తక్కువ వున్న క్యారెక్టర్ కూడా.

అందుకే ఎవరు దొరుకుతారా? అన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ రావా, దేవదాస్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ పెరగాలి అంటే క్రేజీ హీరోయిన్ కావాలి. రకుల్ ప్రీత్ సింగ్ ఏమైనా ఓకె అంటుందా అన్న ఆలోచన కూడా దిల్ రాజుకు వున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద గతంలో బాలయ్యకే హీరోయిన్ల సమస్య వుండేది. ఇప్పుడు పవన్ కు కూడా స్టార్ట్ అయింది. రేణు దేశాయ్ మళ్లీ తల్లి పాత్రలు వేయడానికి ఇటీవల ఉత్సాహం చూపిస్తున్నారు. ఆమెను, పవన్ ను కనుక ఒప్పించగలిగితే, సినిమాకు క్రేజ్ మామూలుగా వుండదు.