రేణుదేశాయ్ స్వతంత్ర భావాలున్న మహిళ. ఆమెలో అనేక కోణాలున్నాయి. పిల్లల్ని ప్రేమించే ఓ తల్లి, సమాజాన్ని ప్రేమించే ఓ మాతృమూర్తి, సామాజిక సమస్యలపై స్పందించే ఓ బాధ్యతగల మనిషి, సినిమాలను ఆరాధించే ఓ కళాకారిణి…ఇలా ఆమె గురించి చెప్పాలంటే అన్ని సుగుణాలు మేళవించిన మంచి కళా హృదయం రేణు సొంతం.
ఒకవైపు కుటుంబానికి న్యాయం చేస్తూనే, మరోవైపు తనకిష్టమైన సినిమా పనులు కూడా చేస్తున్నారామె. శుక్రవారం విడుదల కానున్న‘చూసీ చూడంగానే’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో రేణుదేశాయ్ పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్లు.
రేణుదేశాయ్ మాట్లాడుతూ… ‘ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి ఈ సినిమాలో తల్లి పాత్ర ఆఫర్ చేశారు. ఐ లవ్ ద రోల్. కానీ ఒంట్లో బాగా లేకపోవడం వల్ల ఆ పాత్ర చేయలేకపోయాను. నెక్స్ట్ తీసే సినిమాలో అవకాశం ఇస్తే తప్పకుండా చెస్తా’ అని రేణుదేశాయ్ ప్రకటించారు.
అలాగే సినిమా రంగంలోకి మహిళా టెక్నీషియన్స్ ఎక్కువ మంది రావాలని ఆమె ఆకాంక్షించారు. భవిష్యత్‌లో మేల్, ఫిమేల్ డైరెక్టర్ అనే భేదం పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకోవాలని ఆకాంక్షించారు.