ఏ కొత్త డైరక్టర్ ఫీల్డ్ లోకి వచ్చి సినిమా హిట్ కొట్టడం భయం..లేదా హిట్ కొట్టిన డైరక్టర్ కనిపించడం భయం..నాగార్జున లేదా ఎన్టీఆర్ పిలిచి మరీ చేతిలో సినిమా పెట్టడం అలవాటైంది. కానీ అలా ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేదు. సినిమాలు ఫట్ ఫట్ మని పేలిపోయాయి. లేటెస్ట్ గా కొండా విజయకుమార్ కు చైతూ తో అవకాశం ఇచ్చాడు. అది కూడా ఫట్టే. ఎన్టీఆర్ అయితే చాలా పెద్ద జాబితానే వుంది.
ఈ సంక్రాంతికి హిట్ కొట్టిన నాగ్ సినిమాకు పనిచేసిన కళ్యాణ్ కు అది ఫస్ట్ సినిమా. అలాగే ఎన్టీఆర్ తొ హిట్ కొట్టిన సుకుమార్ కు అంతకు ముందు హిట్ లేదు.. ఆ విధంగా వాళ్లిద్దరి ఏంటీ సెంటిమెంట్లు వర్కవుట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో కొత్త డైరక్టర్ తో నాగార్జున పనిచేయడం ఇదే. అలాగే కాస్త క్లాస్ డైరక్టర్ తో ఎన్టీఆర్ వర్క్ చేయడం కూడా ఇదే. సినిమాల్లోనే కాదు, దాని రూపకర్తల్లో కూడా వైవిధ్యం వుంది. అందుకే సినిమాలు కూడా హిట్ అయ్యాయేమో?