Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

జగన్-కేసిఆర్ ఇచ్చిన మర్యాదలు, చేస్తున్న రాచమర్యాదలతో పెందుర్తి శారదాపీఠం (ఇది శంకరాచార్య స్థాపితం కాదు) స్వామీజీ స్వరూపానంద పేరు ప్రస్తుతం మారుమోగిపోతొంది. రాజకీయ, అధికార ప్రముఖులంతా ఆయన ఆశ్రమానికి క్యూ కడుతున్నారు. ఇదేమీ తప్పుకాదు. ఎవరికీ సమస్యకాదు. కానీ అలా చేయడంలో కొందరు చేస్తున్న అతి వల్ల ప్రభుత్వాలకు చెడ్డపేరు వస్తోంది. ప్రతి ఒక్కరు అదే స్వామీజీని నమ్మాలని లేదు. అలాంటి వారంతా ఈ వ్యవహారాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్, కేసిఆర్ లను తప్పు పడుతున్నారు. వారిచ్చిన అలుసువల్లే ఇదంతా అని కామెంట్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని, సాక్షాత్తూ ఆ బోర్డు చైర్మన్ నే తీసుకెళ్లి, స్వామీజీ కాళ్ల దగ్గర పెట్టడం అన్నది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకన్న భక్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ వస్తే కౌగిలించుకుని, ముద్దాడిని స్వామీజీ, ఏ ఆచారం కారణంగా వెంకన్న ప్రసాదాన్ని చేత్తో అందుకోలేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎకరా రూపాయికే దారాధత్తం చేయడం, స్వామిజీ రికమెండేషన్లతో పనులు, పదవులు లభించడం ఇలాంటి ప్రచారాలు ఏవీ పెద్దగా ఇబ్బంది పెట్టవు.

కానీ సెంటిమెంట్ రాజేసే ఇలాంటి తిరుపతి ప్రసాదం లాంటి విషయాలు మాత్రం ఇట్టే ప్రచారం అయిపోతాయి. ఇదంతా జగన్ కు డ్యామేజ్ నే కానీ మరేమీకాదు. ఇప్పటి నుంచీ జాగ్రత్తలు తీసుకోకపోతే రాను రాను ఇవన్నీ ముదిరి జగన్ కు మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం వుంది.

ఆ స్వామిజీ చెప్పినంత మాత్రాన పనులు జరగవు అని చెప్పడమన్నా చెప్పాలి. లేదా, తమ పార్టీ జనాలను ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లకుండా కట్టడి అన్నా చేయాలి. చంద్రబాబు గతంలో చినజీయర్ కు అనుకూలం అయినా కూడా, ఆయన దగ్గరకు తెలుగుదేశం పార్టీ జనాలు క్యూ కట్టిన సందర్భం ఎప్పుడూలేదు. అలాగే చంద్రబాబు ఏనాడూ నేరుగా చినజీయర్ దగ్గరకు వెళల్లేదు.

జగన్ మాత్రం ఈ తరహా వ్యవహార శైలి అలవర్చుకోలేకపోతున్నారు. పైగా పార్టీ జనాలు మరీ అతి చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్ లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. మరి ఇలా జరగకుండా చూడమని ఎవరు చెబుతారు? 

అగమ్యగోచరంగా టీడీపీ... అంతుబట్టని తీరులో జనసేన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?