పూజాపై ఆ ఫ్యాన్స్ కళ్లు

పూజాహెగ్డే.. తెలుగులో ఇప్పటికి చేసినవి అయిదు సినిమాలు. రాబోయేవి మూడు సినిమాలు. చేసిన అయిదు సినిమాల్లో దువ్వాడ జగన్నాధమ్ ఒక్కటే హిట్ అనిపించుకుంది. రంగస్థలంలో ఐటమ్ నెంబర్ చేసింది. ఒకలైలా కోసం, ముకుంద యావరేజ్…

పూజాహెగ్డే.. తెలుగులో ఇప్పటికి చేసినవి అయిదు సినిమాలు. రాబోయేవి మూడు సినిమాలు. చేసిన అయిదు సినిమాల్లో దువ్వాడ జగన్నాధమ్ ఒక్కటే హిట్ అనిపించుకుంది. రంగస్థలంలో ఐటమ్ నెంబర్ చేసింది. ఒకలైలా కోసం, ముకుంద యావరేజ్ సినిమాలే. సాక్ష్యం సినిమా సంగతి చెప్పనక్కరేలేదు.

ఎన్టీఆర్ అరవింద సమేత, మహేష్ మహర్షి, ప్రభాస్ తరువాత సినిమాల్లో పూజానే హీరో. వీటిలో అరవింద సమేత వీరరాఘవ ముందుగా వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా మీదనే అటు మహేష్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లు వేసి వుంచారు. పూజా ఈ సినిమాతో అయినా హిట్ రూట్ లోకి వస్తుందా? రాదా? అన్నది మాత్రమే కాదట ఫ్యాన్స్ అలా ఆసక్తిగా ఎదురుచూడడానికి.

దువ్వాడ జగన్నాధమ్ లో పూజా గ్లామర్ తళుక్కున మెరిసిన మాట వాస్తవం. కానీ ఆ తరువాత సాక్ష్యం సినిమాలో మాత్రం బాగా బక్కచిక్కిపోయి, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అదోలా మారి ఏమిటోగా కనిపించింది. అరవింద ట్రయిలర్ లో కూడా పూజా బాగా జీరో సైజ్ తోనే కనిపించింది.

మరి సినిమాలో ఎలా  వుంటుందో అన్నదే మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆలోచన. కాస్తంటే కాస్తయినా ఫ్యాట్ వుంటే పూజ గ్లామర్ తళుక్కుమంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే చెన్నయ్ డిఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే, అరవిందలో కూడా పూజా సాక్ష్యంలో మాదిరిగా జీరో సైజ్ తోనే కనిపించిందని.

హీరోయిన్లను అందంగా చూపించడంలో త్రివిక్రమ్ బాగానే కృషి చేస్తారు. అందువల్ల పూజా అరవింద సమేతలో ఎలా వుంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.