మళ్లీ చేతులు కాల్చుకున్న మారుతి

ఇకపై సమర్పించుకోడాలు, కాన్సెప్టులు అందించడాల్లాంటి ప్రయోగాలు చేయనని మారుతి రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అప్పటికే ఆలస్యమైంది. జరిగిన డ్యామేజీని గ్రహించేటప్పటికే 'మారుతి బ్రాండ్'తో మరో సినిమా రెడీ అయిపోయింది. ఫలితం…

ఇకపై సమర్పించుకోడాలు, కాన్సెప్టులు అందించడాల్లాంటి ప్రయోగాలు చేయనని మారుతి రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అప్పటికే ఆలస్యమైంది. జరిగిన డ్యామేజీని గ్రహించేటప్పటికే 'మారుతి బ్రాండ్'తో మరో సినిమా రెడీ అయిపోయింది. ఫలితం కూడా అంతా ఊహించిందే. భలేమంచి చౌకబేరమ్ సినిమా డిజాస్టర్ అయింది.

ఈమధ్య కాలంలో మారుతి మార్క్ తో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. లండన్ బాబులు, బ్రాండ్ బాబు ఇదే కోవలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. ఈ సినిమాల దెబ్బతో ఇక తను ఎలాంటి ప్రయోగాలు చేయనని ప్రకటించాడు మారుతి. కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తానని, సహ-నిర్మాణాలు, కథ-మాటలు అందించడాలు లాంటి వ్యవహారాలు పెట్టుకోనని శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ టైమ్ లోనే స్పష్టంచేశాడు. 

కానీ మారుతి అలా ఎనౌన్స్ చేసిన టైమ్ కే భలే మంచి చౌకబేరమ్ రెడీ అయిపోయింది. నిజానికి ఈ సినిమా బ్రాండ్ బాబుతో పాటే సిద్ధమైంది. ఆ టైమ్ లో కొంతమంది సినీపెద్దలు, మీడియా వ్యక్తులు కూడా ఈ సినిమా చూశారు. అస్సలు బాగాలేదు రిపేర్లు చేసి రిలీజ్ చేస్తే మంచిదని హెచ్చరించారు కూడా. 

అలా స్మాల్ గ్యాప్ తర్వాత, ఎలాంటి రిపేర్లు లేకుండానే నేరుగా థియేటర్లలోకి వచ్చింది భలే మంచి చౌకబేరమ్. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ నటించిన ఈ సినిమాకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారం చేశాడు మారుతి. కానీ సినిమా ఫ్లాప్ అవుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు అదే జరిగింది. ఇన్నాళ్లూ మారుతి చేసిన ప్రయోగాలు ఈ సినిమాతో పరిపూర్ణం అయ్యాయి. ఇకపై ఈ దర్శకుడి నుంచి ఇలాంటి సినిమాలు రావు.