పవర్ పై రవితేజ మహా మోజు

బాబి దర్శకత్వంలొ రూపొందిన పవర్ సినిమాపై హీరో రవితేజ మహా మోజుగా వున్నాడట. తరచు సినిమా ఎంతో కొంత చూస్తున్నాడట. ఇప్పటికి ఇలా నాలుగైదుసార్లు చూసినట్లు బోగట్టా. సినిమా చాలా బాగా వచ్చిందని, సన్నిహితులకు…

బాబి దర్శకత్వంలొ రూపొందిన పవర్ సినిమాపై హీరో రవితేజ మహా మోజుగా వున్నాడట. తరచు సినిమా ఎంతో కొంత చూస్తున్నాడట. ఇప్పటికి ఇలా నాలుగైదుసార్లు చూసినట్లు బోగట్టా. సినిమా చాలా బాగా వచ్చిందని, సన్నిహితులకు చెప్పి, ఆనందిస్తున్నాడట. ఇదిలా వుంటే దర్శకుడు బాబి కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టకున్నాడట.ఈ సినిమా హిట్ అయితే తన మాతృసంస్థ పివిపిలో మరో సినిమా చేస్తాడని వినికిడి. 

 ఆ సంగతి ఎలా వున్నా రవితేజకు ఈ సినిమా విజయం మాత్రం చాలా అవసరం. బలుపు ముందు పెద్దగా హిట్ లు లేని రవితేజకు ఆ సినిమా కాస్త ఊపునిచ్చింది. అది కొనసాగాలంటే ఈ సినిమా హిట కొట్టాలి. చాలా గ్యాప్ వచ్చినా రవితేజ మార్కెట్ పోలేదు అనడానికి పవర్ అమ్మకాలే నిదర్శనం.