తెలంగాణ ఫిల్మ్ సిటీ హుళక్కేనా?

కెసిఆర్ ప్రతిపాదస్తున్న రెండు వేల ఎకరాల ఫిల్మ్ సిటీ వ్యవహారం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సినిమా పెద్దలకు తెరస లోని కీలక వ్యక్తులకు నడుమ రాజీ కుదరినట్లు సమచారం. టాలీవుడ్…

కెసిఆర్ ప్రతిపాదస్తున్న రెండు వేల ఎకరాల ఫిల్మ్ సిటీ వ్యవహారం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సినిమా పెద్దలకు తెరస లోని కీలక వ్యక్తులకు నడుమ రాజీ కుదరినట్లు సమచారం. టాలీవుడ్ లో ఇప్పటికే సరిపడ ఇన్ ఫా స్ట్రక్చర్ వుంది. ఇప్పుడు తెలగాణ ప్రభుత్వం కనుక రెండు వేల ఎకరాల ఫిల్మ్ సిటీ కనుక నిర్మిస్తే దీర్ఘకాలంలో పరిస్థితి తారుమారవుతుంది. అందుకే టాలీవుడ్ తరపున కొందరు పెద్దలు, కొందరు రాజకీయ ప్రముఖులు తెరాసలోని ప్రముఖులతో మంతనాలు జరిపినట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. 

ఇక్కడ సమస్య ఏమిటంటే, హైదరాబాద్ లో సీమాంధ్ర టాలీవుడ్ జనాలు తయారుచేసుకున్న వ్యవస్థ తరలించెందుకు వీలయ్యేది కాదు. ఆర్ఎఫ్ సి, అన్నపూర్ణ, రామానాయుడు అన్నీ స్థిరాస్థులు. అక్కడే వుంచి, వ్యాపారం సాగించుకోవాల్సిందే. పెరుగుతున్న వ్యాపారంలో, కొత్త ఫిల్మ్ సిటీ వచ్చినా భయపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఇంకో సమస్య వుంది. తెలంగాణ ప్రభుత్వ ఫిల్మ్ సిటీ అన్నపుడు సహజంగా, ప్రభుత్వ గుడ్ లుక్స్ లో వుండేందుకైనా అక్కడ పనులు చేసుకునేందుకు నిర్మాతలు మొగ్గు చూపక తప్పదు. ఇప్పుడు నమస్తే తెలంగాణ దినపత్రిక మాదిరిగానే. ఒకప్పుడు సాక్షి, జ్యోతి, ఈనాడులను మాత్రమే గుర్తించి, ప్రతి ప్రకటన వాటికి ఇచ్చే  వ్యవహారం నడిచేది. ఇప్పుడు ఆ జాబితాలో నమస్తే  తెలంగాణ కూడా చేరింది. తెలంగాణకు చెందిన ఏకైక పత్రిక అన్న భావనతో ఇలా చేస్తున్నరన్నది కాదనలేని విషయం. రేపు ఇదే తరహా  ఫిల్మ్ సిటీ వ్యవహారంలో కూడా వుంటుంది. 

అసలు నిజంగనే కెసిఆర్ మదిలో ఫిల్మ్ సిటీ ఆలోచన వుందా..లేక కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యంలో వున్న టాలీవుడ్ కు ఝలక్ ఇవ్వడానికి ఇలాంటి ప్రకటన చేసారా అన్న అనుమానం కూడా వుంది. ఎందుకంటే ఫిల్మ్ సిటీకి సరిపడా సలహా సంప్రదింపులిచ్చే అనుభవజ్ఞులు, ఆ తరహా వ్యాపారంపై మొగ్గు చూపే తెలంగాణ వారు తక్కువ. తెలంగాణకు చెందిన వారిలో దిల్ రాజు, హీరో నితిన్, అతని తండ్రి మినహా  ఆ స్థాయి వ్యక్తులు లేరు. కెసిఆర్ ఫిల్మ్ సిటీని ప్రకటించగానే. హడావుడి చేసిన టాలీవుడ్ కు చెందిన తెలంగాణ జనాల రేంజ్ ఏ మేరకు అన్నది అందరికీ తెలిసిందే. కేవలం వీరిని నమ్ముకుని కేసిఆర్ రెండువేల ఎకరాల ఫిల్మ్ సిటీ నిర్మాణానికి దిగుతారా అన్నది అనుమానం. 

అయినా ఎందుకు వచ్చిన రగడ అని టాలీవుడ్ తరపున కొందరు ప్రముఖులు, కొందరు రాజకీయ పెద్దలు ఇక్కడి నుంచి పరిశ్రమను తరలించే యోచన ఎంత మాత్రం లేదని, తెరాసకు, ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియచెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు కెసిఆర్ నుంచి సంతృప్తికరమైన హమీ దొరికిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి ఏ మేరకు నిజం అన్నది కొన్నాళ్లు ఆగితే తెలిసిపోతుంది.