పవర్ స్టార్ కు వీక్ నెస్

కరోనా వచ్చి తగ్గింది అంటే అందరికీ వుండే సమస్య విపరీతమైన వీక్ నెస్. ఈ వీక్ నెస్ కు వయసుతో, హోదాతో, డబ్బుతో సంబంధం లేదు.  Advertisement కామన్ మాన్ అయినా ఒకటే పవర్…

కరోనా వచ్చి తగ్గింది అంటే అందరికీ వుండే సమస్య విపరీతమైన వీక్ నెస్. ఈ వీక్ నెస్ కు వయసుతో, హోదాతో, డబ్బుతో సంబంధం లేదు. 

కామన్ మాన్ అయినా ఒకటే పవర్ స్టార్ అయినా ఒక్కటే. ఇటీవల కరోనా బారిన పడి తేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు విపరీతమైన నీరసంతో బాధపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

అందుకే కరోనా వ్యవహారం ఇప్పటికిప్పుడు చక్కబడినా షూటింగ్ లకు మాత్రం జూన్ తరువాతే వెళ్లాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు బోగట్టా. 

అంతే కాదు, ఈ మధ్య ఆయన అటు సినిమాలు ఇటు రాజకీయాలు ఎడా పెడా చేస్తూ, కాస్త ఎక్కువగా వర్క్ చేసారు. ఇకపై అలా కాకుండా కాస్త రెస్ట్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆయన వ్యవహారాలను దృష్టిలో వుంచుకుని అయ్యప్పన్ రీమేక్ అలాగే హరి హర వీరమల్లు షెడ్యూళ్లను జూన్ తరువాత నుంచి ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.