cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ సినిమా ఓపెనింగ్ అందుకోసమా?

ప్రభాస్ సినిమా ఓపెనింగ్ అందుకోసమా?

బాహుబలి తరువాత ప్రారంభమైన ప్రభాస్ సినిమా సాహో. అది ఎప్పుడు రెడీ అవుతుందో ఇప్పటికి అయితే క్లారిటీ లేదు. మహేష్, రామ్ చరణ్, చిరంజీవి ఇలా పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు అన్నింటికీ ఓ ఫలానా టైమ్ లో అన్న క్లారిటీ వుంది కానీ, సాహోకు ఆ పరిస్థితి లేదు. దానికి కారణం, ఆ సినిమా స్పాన్, భారీతనం అలాంటివి.

ఇలాంటి టైమ్ లో ప్రభాస్ ఆస్థానంలో వెయింటింగ్ లో వున్న మరో డైరక్టర్ రాధాకృష్ణ సినిమాకు ఈనెల 6న ముహుర్తం, చేస్తున్నారు. అది కూడా వీలయినంత సింపుల్ గా. పెద్దగా హడావుడి చేయకుండానే కానిచ్చే ఆలోచనలో వున్నారు. సాహో పూర్తికాకుండా ఇది ఎందుకోసం అంటే ముహుర్తం కోసం. మళ్లీ శూన్యమాసం వస్తుందని.

అయినా కూడా సాహోకి చాలా టైమ్ వుంది, బోలెడు ముహుర్తాలు వుంటాయి కదా? అనుకుంటే, అసలు విషయం వేరే వుందని తెలుస్తోంది. సాహో సినిమా కోసం త్వరలో యుకె వెళ్లే ఆలోచనలో వున్నారు. రాధాకృష్ణ సినిమాకు కూడా యుకె షెడ్యూలు వుంది. అందువల్ల మళ్లీ మళ్లీ ఖర్చులు, పర్మిషన్లు ఇతరత్రా వ్యవహారాలు కలిసిరావడం కోసం ముందుగా ఓ షెడ్యూలు అక్కడ లాగించేయాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంటే సాహొ సినిమా చేస్తూనే, రాధాకృష్ణ డైరక్షన్ లో చేసే సినిమా యూరప్ షెడ్యూలు ఒకటి లాగించేస్తారు అన్నమాట. అలా చేయాలంటే, సినిమాకు ముహుర్తం చేయాలి. అదీ సంగతి. ఇప్పుడు జస్ట్ ముహుర్తం చేసి, సాహోతో పాటు చిన్న షెడ్యూలు చేసి, పక్కన పెడతారు. ఆ తరువాత మళ్లీ ఎప్పుడో?