Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ లేని ఐటమ్ సాంగ్

ప్రభాస్ లేని ఐటమ్ సాంగ్

మనోహరా అంటే.. అంటే మనోహరీ అంటూ బాహుబలి సిరీస్‌లో ప్రభాస్ కనిపించే ఐటమ్ సాంగ్ లెవెల్ నే వేరు. గుండు సూది.. గుండు సూది అంటూ శ్రియ రెచ్చి పోయి పాడేస్తుంటే, అక్కడే ప్రభాస్ హావభావాలు వేరు. 

కానీ అలాంటివి ఏవీ సలార్ ఐటమ్ సాంగ్ లో ఫ్యాన్స్ ఆశించడానికి లేదు. ఎందుకంటే సలార్ ఐటమ్ సాంగ్‌లో ప్రభాస్ కనిపించరట. ఆయన పాత్ర ఆ సాంగ్ లో వుండదట. ఇది కచ్చితంగా నిరాశ కలిస్తుంది ఫ్యాన్స్ కు.

ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ మీదే ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి సిరీస్ తరువాత నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసే సరైన సినిమా రాలేదు. కేజిఎఫ్ సిరీస్ అందించిన ప్రశాంత్ నీల్ కు ఇప్పుడు ఫుల్ క్రేజ్ వుంది. అలాంటి ప్రశాంత్ నీల్ సినిమా కనుక సలార్ మీద చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు.

కానీ సమస్య ఏమిటంటే సలార్ లో డ్యూయట్, ఐటమ్ సాంగ్ లో హీరో స్టెప్స్ వంటి రొటీన్ ఫార్ములా విషయాలు వుండకపోవచ్చు. కేజిఎఫ్ మాదిరిగా ఎమోషనల్ యాక్షన్ సినిమా గా సలార్ తెరకెక్కుతోంది అని అనుకోవాల్సిందే.  అయితే ఇప్పుడు ఫార్మాట్ సినిమాలే అవసరం. లేదు కొత్తగా డిఫరెంట్ గా వున్నా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కానీ ఒకటే కండిషన్ బీభత్సమైన యాక్షన్ లేదా ఎంటర్ టైన్ మెంట్ వుండాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?