ప్రభాస్ నిర్ణయం మైత్రీకి షాక్

ఈ మధ్య అడ్వాన్స్ లకు సినిమాలకు సంబంధం లేకుండా వుంది. హీరోలను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తన్నుకుపోతున్నారు నిర్మాతలు. మైత్రీ విషయంలో ఇలాగే జరుగుతోంది పాపం. పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ ఏనాడో పురానా…

ఈ మధ్య అడ్వాన్స్ లకు సినిమాలకు సంబంధం లేకుండా వుంది. హీరోలను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తన్నుకుపోతున్నారు నిర్మాతలు. మైత్రీ విషయంలో ఇలాగే జరుగుతోంది పాపం. పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ ఏనాడో పురానా జమానాలో ఇచ్చారు. కానీ దిల్ రాజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఎఎమ్ రత్నం వున్నారు. ఆ తరువాత కానీ అన్నీ బాగుంటే 2021లో మైత్రీ వంతు వస్తుంది.

ప్రభాస్ సంగతి అలాగే వుంది. కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు ఎప్పుడో..ఏనాడో. బాహుబలి తరువాత సాహో అయింది. ఆ తరువాత రాథేశ్వామ్ అవుతోంది. ఆ తరువాత తమ వంతు వస్తుంది అనుకుంటే అశ్వనీదత్ ఎంటర్ అయిపోయారు మధ్యలో. నాగ్ అశ్విన్ సినిమా అంటే కనీసం ఏడాది పైనే చెక్కుతారని టాక్ వుంది.  పైగా దిల్ రాజుతో వున్న సెటిల్ మెంట్ వ్యవహారం ఒకటి వుండనే వుంది.

ఈ లెక్కన 2022 కు అయినా ప్రభాస్ సినిమా కోసం మైత్రీ దగ్గరకు వస్తారో? రారో? ఒక విధంగా ఇది దిల్ రాజుకు కూడా ఇబ్బందే. సాహో టైమ్ లో ఆయన యువికి అన్ని విధాలా మద్దతుగా నిలిచారు. ఆ టైమ్ లో తరువాత సినిమాను ప్రభాస్ ఆయనకు చేసేందుకు మాట ఇచ్చారని వినిపించింది. దిల్ రాజు కూడా రాథేశ్వామ్ తరువాత సినిమా తనదే అన్న ధీమాలో వున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అందువల్ల దిల్ రాజు సినిమా కూడా వెనక్కు నెట్టేసినట్లే అయింది.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది