ప్రభాస్.. సలార్.. ఏం జరుగుతోంది?

డిసెంబర్ ఆఖరులో రాబోతున్న పెద్ద సినిమా సలార్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ భలే గమ్మత్తుగా డిస్కస్ చేసుకుంటోంది. ఒకటి భారీ సినిమా. దానికి అటు ఇటు సినిమాలు వేయకుండా దూరంగా వుంటేనే మంచిది.…

డిసెంబర్ ఆఖరులో రాబోతున్న పెద్ద సినిమా సలార్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ భలే గమ్మత్తుగా డిస్కస్ చేసుకుంటోంది. ఒకటి భారీ సినిమా. దానికి అటు ఇటు సినిమాలు వేయకుండా దూరంగా వుంటేనే మంచిది. ప్రశాంత్ నీల్ దర్శకుడు.. ప్రభాస్ హీరో. అందువల్ల ఓపెనింగ్ మామూలుగా వుండదు. హిట్ అయితే ఎక్కడో వుంటుంది సినిమా.. ఇదీ ఒక రకం డిస్కషన్.

మరోరకం డిస్కషన్ వేరుగా వుంది. కెజిఎఫ్ సిరీస్, కాంతారా లాంటి సినిమాలు తక్కువ కమిషన్ మీద అస్సలు పెద్దగా అడ్వాన్స్ లు కూడా తీసుకోకుండా నేరుగా విడుదల చేసుకుని, లాభాలు తిన్న నిర్మాతలు ఇప్పుడు సలార్ ను ఎలాగైనా నాన్ రిటర్న్ అడ్వాన్స్ ల మీద అమ్మేయాలని అనుకుంటున్నారు. ఆంధ్ర నుంచి 100 కోట్లు వస్తాయని అంచనా వేసిన వాళ్లు, అలా రాకుంటే 75 కు ఎందుకు తగ్గిపోతున్నారు? రేటు తగ్గుతున్నా కూడా బయ్యర్లు ఎందుకు ధైర్యంగా ముందుకు రావడం లేదు. ఇది రెండో రకం డిస్కషన్.

ఇదిలా వుంటే కొన్ని గ్యాసిప్ లు కూడా సలార్ మీద వినిపిస్తున్నాయి. హీరో ప్రభాస్ ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు, నిర్మాతలకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయన్నది ఆ గుసగుసల సారాంశం. సినిమా కంటెంట్ క్వాలిటీ మీద ప్రభాస్ సంతృప్తిగా లేరని టాక్. అలాగే విడుదల డేట్ మీద కూడా అయిష్టంగా వున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో సరైన డేట్ కాదని ప్రభాస్ చెప్పినా నిర్మాతలు అంగీకరించలేదని తెలుస్తోంది. దాంతో ప్రభాస్ సైలంట్ అయ్యారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో వున్నారు. సలార్ టీమ్ సినిమా కంటెంట్ ఏమీ వదలడం లేదు. సినిమా విడుదల మరో ఏడు వారాల్లో వుంది. మరి రెండు రెండు మూడు వారాల తరువాత ప్రచారం మొదలుపెడతారేమో తెలియదు. ప్రభాస్ కనుక ప్రచారంలో పాల్గొనకుంటే మాత్రం సినిమా మీద వినిపిస్తున్న గ్యాసిప్ లు అన్నీ నిజమనే అనుకోవాల్సి వస్తుంది.