సినిమాలు హిట్ కావడమే హీరోల రెమ్యూనిరేషన్లకు కొలమానం. తెలుగు హీరోల రెమ్యూనిరేషన్లు చాలా అంటే చాలా ఫాస్ట్ గా పెరుతున్న సంగతి తెలిసిందే. గమ్మత్తేమిటంటే హిట్ అయినా పెరుగుతున్నాయి. కాకున్నా పెరుగుతున్నాయి.
ఏడెనిమిది ఫ్లాపులు ఇచ్చినా రెమ్యూనిరేషన్ పెరుగుతూనే పోతోంది ఓ హీరోకి. అలాంటిది హిట్ లు ఇస్తున్న బాలయ్య రెమ్యూనిరేషన్ ఎందుకు పెరగదు? అఖండ సినిమా విడుదల కాకముందు వీరసింహారెడ్డి ఓకె చేసారు. అప్పటికి జస్ట్ 10 కోట్లు మాత్రమే పారితోషికం. చాలా మంది హీరోలతో పోల్చుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్.
అఖండ హిట్ కావడంతో వీరసింహారెడ్డి రెమ్యూనిరేషన్ 14కు పెరిగింది. అప్పటికే ఒప్పుకున్న సినిమా భగవంత్ కేసరి. దానికి అప్పటికి 14 కి ఒప్పుకున్నారు. వీరసింహారెడ్డి తరువాత దాన్ని 18 కోట్లకు ఫైనల్ చేసారు. ఇప్పుడు లేటెస్ట్ గా చేయబోతున్న సినిమా బాబీ డైరక్షన్ లో. ఆ సినిమా కు రెమ్యూనిరేషన్ 28 కోట్లు అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు 28 కోట్లు రెమ్యూనిరేషన్ అన్నా నిర్మాతలు హ్యాపీనే. ఎందుకంటే బాలయ్యకు సరైన డైరక్టర్ కాంబినేషన్ పడితే 150 కోట్లకు పైగానే బిజినెస్ వుంటుంది.
నిజానికి 150 కోట్ల మేరకు బిజినెస్ లేని చాలా మంది హీరోలు తెలుగులో 25 కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. సీనియర్ హీరోల్లో పవన్ కళ్యాణ్ 60 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. మెగాస్టార్ యాభై కోట్ల మేరకు తీసుకుంటున్నారు. తరువాత ప్లేస్ ఇప్పుడు బాలయ్య చేరారు. ఆ తరువాత రవితేజ 24 కోట్ల రేంజ్ లో వున్నారు. వెంకీ 10 కోట్ల దగ్గర వున్నారు. నాగ్ ఇంకా 10లోపులే వున్నారు.