నితిన్.. మాస్ ఎంటర్ టైన్ మెంట్ లోడింగ్

సరైన హిట్ కోసం గట్టిగా ట్రయ్ చేస్తున్నాడు హీరో నితిన్. అందుకే ఒకటికి రెండు సార్లు ముందు.. వెనుక చెక్ చేసుకుని వెళ్తూ, లేటెస్ట్ సినిమాను ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్స్ ట్రా ఆర్టినరీ…

సరైన హిట్ కోసం గట్టిగా ట్రయ్ చేస్తున్నాడు హీరో నితిన్. అందుకే ఒకటికి రెండు సార్లు ముందు.. వెనుక చెక్ చేసుకుని వెళ్తూ, లేటెస్ట్ సినిమాను ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్స్ ట్రా ఆర్టినరీ మాన్ అంటూ ఒక డిఫరెంట్ టైటిల్ తో సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలయింది. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు. నితిన్ హెయిర్ స్టెయిల్ కొత్తగా వుంది. డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

దర్శకుడు వక్కంతం ఫన్ అండ్ మాస్ బేస్డ్ స్టోరీ తయారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ లు తమ పరిచయం చెప్పుకోవడం కాస్త కష్టంగానే వుంటుంది. దాంట్లోనే వెదుక్కుంటూ ఫన్ కూడా వుంటుంది. దాన్నే టీజర్ లోకి తీసుకువచ్చారు. బాహుబలిలో ఆరో లైన్ లో ఏడోవాడు అనే టైపు పరిచయం అలాంటిదే. యాక్షన్, లవ్, మధ్యతరగతి మెలోడీ, ఇలా అన్ని జోనర్లు మిక్సీలో వేసినట్లున్నారు.

టోటల్ గా ఓ కామన్ ఆడియన్ కు కావాల్సిన మాస్ ఎంటర్ టైనర్ తో నితిన్ ఈసారి వస్తున్నాడు అని అర్థం అయింది. టీజర్ కట్ మొత్తం ఫన్ మీదే వెళ్లింది. హారిష్ జైరాజ్ సంగీతంలో పాటలు ఎలా వుంటాయి అన్నది ఆసక్తి కరం. మంచి మ్యూజిక్ ఇస్తాడు. 

టీజర్ లో వచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అయితే బాగానే వుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నెలలో భగవంత్ కేసరి, వచ్చే నెలలో ఆదికేశవ, డిసెంబర్ లో ఈ సినిమా..టోటల్ గా ప్రతి నెల ఒక రిలీజ్ హీరోయిన్ శ్రీలీలకు.