Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రేమకావ్యాలే ‘లవ్ స్టోరీ’ కి ఇన్సిపిరేషన్.

ప్రేమకావ్యాలే ‘లవ్ స్టోరీ’ కి ఇన్సిపిరేషన్.

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “లవ్ స్టోరీ”.శేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య-సాయిపల్లవిల కాంబినేషన్ లో తయారవుతున్న ఈ సినిమా 24న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. ''...లవ్ స్టోరీ ఫీల్ గుడ్ మూవీ. 

ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఉంటాయి వాటితో పాటుగా మరో కీలక పాయింట్ ఈ సినిమాని మరో స్థాయిలో పెట్టేలా ఉంటుంది అదే ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ లా ఉంటుంది. ఈ సినిమాలో రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి కుల వివక్షత అనేది అబ్బాయి విషయంలో ఇంకొకటి ఆడ మగ తారతమ్యంపై.. ఈ రెండు విషయాల పై సినిమాలో బలంగా చూపించడం జరిగింది. 

నాగచైతన్య ను తెలంగాణ కుర్రాడిగా చూపించడానికి ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం, సినిమాలో తన డైలాగ్స్ నుంచి మ్యానరిజమ్స్ వరకు ప్రతీ అంశంలో కూడా డబ్బింగ్ లో ప్రతి పదం సినిమా షూట్ లో కూడా నా టీం అంతటితో చాలా వర్క్ చేసి, తెలంగాణా స్లాంగ్ లో చైతూని ముందు సినిమాల్లో చూపించని విధంగా ట్రై చేసాం. ఖచ్చితంగా చాలా నమ్మకంగా చెప్తున్నాం ఈ సినిమాలో చాలా కొత్త నాగ చైతన్యని అందరూ చూస్తారు. 

సాయి పల్లవి ని మళ్లీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆమె ఒక మంచి పెర్ఫామార్ అంతే అంతకు మించి ఏం లేదు.. చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఫిదా నుంచి ట్రావెల్ అయ్యాం కాబట్టి తన కోసం బాగా తెలుసు అందుకే ఈ సినిమాకి తీసుకున్నాం. ముందు ఫిదా లో అయితే తన రోల్ ఒకలా ఉంటుంది కానీ ఈ సినిమాలో కంప్లీట్ దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. తనలోనే తాను మధనపడుతూ స్ట్రగుల్ అవుతూ ఉండేలా కనిపిస్తుంది. చాలా షేడ్స్, ఉన్న రోల్ అది దానిని తను చాలా కస్టపడి చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ను తీసుకోవడానికి కారణం ఆయన రెహమాన్ దగ్గర వర్క్ చేసాడు అని కాదు కానీ పవన్ ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తాడు అని అనిపించింది.  నేను పెట్టుకున్న అంచనాలకి మించే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ప్యాండమిక్ టైం లో ఏదన్నా మంచి మాకు జరిగింది అంటే అది ఈ సినిమా మ్యూజిక్ హిట్టవడమే అని చెప్పాలి. తాను మాత్రం సూపర్ జాబ్ ఇచ్చాడు. ఖచ్చితంగా అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

నా ఇది వరకటి సినిమాల్లో లాగే ఈ సినిమా కూడా వాటి లానే మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో ఓ పాయింట్ ఉంటుంది. అంటే ఓ కష్టం ఉంటుంది అది డెఫినెట్ గా ప్రతీ ఒక్కరికీ తలిగేలా ఉంటుంది అది ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ సినిమాని వదిలిపెట్టరు. 

నేనే కాదు ఎవరైనా సరే తమ సినిమాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు. ఇందులో కూడా ఆ షేడ్స్ ఉన్నాయి. కొన్ని అంచనాలు ప్రతీ ఒక్కరు పెట్టుకుంటారు మొన్న నాగార్జున గారు ప్రేమ్ నగర్ సినిమా రిలీజ్ రోజున ఇది కూడా అవుతుంది అని పెట్టారు ఆ సినిమా సక్సెస్ లో నా సినిమా ఒక 30 పర్సెంట్ అందుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. 

లీడర్ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే తోనే నడిచే విధంగా సీక్వెల్ ని చేస్తాను. నెక్స్ట్ ధనుష్ తో చేస్తున్నా.

తమిళ్, తెలుగు ముందు అనుకున్నాం ఇక ఎలాగో ఓటిటితో అందరికీ మంచి రీచ్ వచ్చింది కాబట్టి హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాం. పైగా ధనుష్ కి కూడా హిందీలో రీసెంట్ గా మంచి మార్కెట్ వచ్చింది. నా ముందు సినిమాల్లా కాకుండా ఇది థ్రిల్లర్ టైప్ లో ఉంటుంది, పైగా కథ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అందుకే మల్టీ లాంగ్వెజెస్ సినిమాలా ప్లాన్ చేసాం. అంటూ ముగించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?