ఇకపై ప్రేమ సినిమాలు చేయను అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ పడేసాడు హీరో విజయ్ దేవరకొండ. ఆయన ఉద్దేశంలో ప్యూర్ లవ్ స్టోరీలు చేయను అన్నది ఐడియా కావచ్చు. కానీ నిజానికి ప్రేమ లేని సినిమా ఎక్కడ వుంటుంది. బాహుబలి అయినా ప్రేమ కథ జోడించాల్సిందే. అశ్వద్దామ లాంటి థ్రిల్లర్ అయినా ప్రేమ పిట్టకథను చెప్పాల్సిందే. ఆఖరికి శంకరాభరణం లాంటి సంగీత భరత చిత్రంలోనూ చంద్రమోహన్-రాజ్యలక్ష్మిల ప్రేమకథ వుంది కదా?
ప్రేమ కథ లేని తెలుగు సినిమా ను ఊహించలేము. అయినా ఇప్పుడు విజయ్ ను అన్నీ ప్రేమ కథలే చెస్తున్నావని ఎవరు అన్నారు? అర్జున్ రెడ్డి. ఓ అగ్రెసివ్ కుర్రాడి కథ. అందులో ప్రేమ కూడా ఓ భాగం. డియర్ కామ్రేడ్ ఓ స్టూడెంట్ లీడర్ కథ. అందులో ప్రేమ ఓ భాగం. గీతగోవిందం ఓ ఔత్సాహిక ఫ్యామిలీ అబ్బాయి ప్రేమకథ.
దేని వేరియేషన్లు దానికి వున్నాయి. సక్సెస్ కావడం కాకపోవడం అన్నది దర్శకుడు సబ్జెక్ట ను డీల్ చేసిన విధానం, సినిమాను తెరపైకి తెచ్చిన విధానాన్ని బట్టి వుంటుంది. డియర్ కామ్రేడ్ ఫెయిల్ అయిందనో, మరో ఆలోచనతోనే విజయ్ ఇలా అనకుండా వుండాల్సింది. పూరి తో చేసే ఫైటర్ సినిమాలో ప్రేమ వుండదా? డ్యూయట్లు వుండవా?
అలా కాదు, ప్యూర్ లవ్ స్టోరీలు మాత్రమే చేయను అన్నాడు అని అనుకున్నా, ఎప్పటికీ వేరే సినిమాలే చేస్తూ వుంటే బోర్ కొట్టదా? అయినా ఓ మాంచి ప్రేమ సినిమా విడుదలకు ముందు ఇకపై ప్రేమ సినిమాలు చేయను అంటే, నా ప్రేమ సినిమా ఇదే లాస్ట్, అర్జెంట్ గా చూడమని అనుకోవాలా? ఇంకేమైనా అర్థాలు ఆలోచించాలా?