Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ఆర్ఆర్ బిజినెస్ ప్రారంభం

ఆర్ఆర్ఆర్ బిజినెస్ ప్రారంభం

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబో ఆర్ఆర్ఆర్ విడుదల డేట్ మీద క్లారిటీ వచ్చేసింది.  2021 జనవరి 8న విడుదల అని ఫిక్స్ చేసేసారు. దీంతో ఇక బిజినెస్ డీల్స్ ప్రారంభమయ్యాయి. ఆంధ్ర ఏరియాకు 100 కోట్ల రేషియో చెబుతున్నా, జనాలు పోటీ పడుతూనే వున్నారు. ఒక్కో ఏరియా ఇద్దరి నుంచి నలుగురు అడుగుతున్నాయి. దీంతో ఛూసీగా క్లోజ్ చేస్తున్నారు.

ముందుగా వెస్ట్ గోదావరి క్లోజ్ చేసారు. బాహుబలి చేసిన ప్రవీణ్ కు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈస్ట్ పోటా పోటీగా వుంది. బాహుబలి, సాహో చేసిన బుచ్చిరాజుకే ఇచ్చేలా వున్నారు.

వైజాగ్ సాయి కొర్రపాటి అని వినిపిస్తోంది. నైజాం కు దిల్ రాజు 75 కోట్లు కోట్ చేసారు. బేరం ఇంకా ఫినిష్ కాలేదు. కానీ దిల్ రాజుకే ఇచ్చే అవకాశం వుంది. మిగిలిన ఏరియాలు ఇవ్వాళ రేపట్లో డిసైడ్ కావచ్చు. 

ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్ర 100, నైజాం 75 . మరి సీడెడ్ ఎంత వుంటుందో? కనీసం 50 కోట్లు అయినా  వుంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే 225 కోట్ల బిజినెస్ అన్నమాట.

ఇదే నా చివరి ల‌వ్ స్టోరి సినిమా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?