ప్రలోభాల గురించి పచ్చదళమే చెప్పాలి!

అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో నెగ్గించుకోవడానికి ఒక్కో ఎమ్మెల్సీకి వైకాపా నాయకులు 25 కోట్లు ఆఫర్ చేశారట. మండలి ఛైర్మన్ షరీఫ్ కు 50 కోట్లు ఆశ చూపారట! వినేవాడు వెర్రి వెంగళాయి అయితే..…

అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో నెగ్గించుకోవడానికి ఒక్కో ఎమ్మెల్సీకి వైకాపా నాయకులు 25 కోట్లు ఆఫర్ చేశారట. మండలి ఛైర్మన్ షరీఫ్ కు 50 కోట్లు ఆశ చూపారట! వినేవాడు వెర్రి వెంగళాయి అయితే.. చెప్పేవాడు దేవినేని ఉమా అవుతాడు.. అన్న సామెత చందంగా ఉంది ఆయన మాట్లాడుతున్న వ్యవహారం. అంటే  ఇంచుమించుగా.. మండలిలో బిల్లును నెగ్గించుకోవడానికి దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించడానికి వైకాపా సిద్ధ పడింది అన్నట్లు ఉమా ఆరోపణలు ఉన్నాయి.

కేసు వాదించడానికి న్యాయవాదికి  5 కోట్ల రూపాయల ఫీజు చెల్లించడాన్ని తప్పుపట్టవచ్చు. ఆ విషయం అధికారికంగా జీవో కూడా వచ్చింది. అయితే.. ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ కు ఆఫర్ ల గురించి ఉమా ఏ ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కాని సంగతి. గుడ్డ కాల్చి మొహాన పారేస్తే వారే కడుక్కుంటారు లెమ్మన్న చందంగా ఆయన తీరు కనిపిస్తోంది.

అయినా కామెడీ ఏంటంటే.. ఎమ్మెల్సీలకు ప్రలోభాల గురించి.. తెలుగుదేశం నాయకులు మాట్లాడడం. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ ఓటు కోసం కోట్ల రూపాయల సొమ్ము తీసుకువెళ్లి అడ్డంగా దొరికిపోయిన చరిత్ర తెలుగుదేశం నాయకులది. ప్రలోభ పెట్టే ఆఫర్లు ఇచ్చి.. ఆడియో టేపులు బయటపడి పరువుపోగొట్టుకున్న చరిత్ర చంద్రబాబునాయుడుది. అలాంటి వాళ్లు ఇప్పుడు, తమకు ఎలాంటి అదనపు ప్రయోజనమూ లేని వ్యవహారం కోసం వందల కోట్ల రూపాయలు వైకాపా ప్రలోభ పెట్టిందని అంటుండడం కామెడీ కాక మరేమిటి?

అయినా.. ప్రలోభాలు పెడుతూ.. అడ్డంగా దొరికిపోయిన అనుభవం ఉన్నవారు… వైకాపా నాయకులు తమ ఎమ్మెల్సీలను, లేదా మండలి ఛైర్మన్ ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు… వాటికి ఆధారాలు సంపాదించి ఉండవచ్చు కదా. ఇవాళ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెంది ఉన్నదంటే.. ఎలాంటి అక్రమాలనైనా ఇట్టే పట్టుకోగలిగే వాతావరణం ఉంది. అలాంటప్పుడు.. ప్రలోభాలు ఎలా సాగాయో  చిన్నపాటి ఆధారాలను తెదేపా నాయకులు రికార్డు చేసి ఉంటే గనుక.. ఇవాళ ఇలా.. చవకబారు ఆరోపణల రూపంలో కాకుండా, నిర్దిష్టంగా వైకాపా ను బజారుకీడ్చేలా.. ఆధారాలు బయటపెట్టి ఉండవచ్చు.

వాస్తవంలో అలాంటిదేమీ లేదు గనుకనే.. నోటికి వచ్చిన అంకెలతో.. దేవినేని ఉమా లాంటి నాయకులు ఇచ్చమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది. ఇలాంటి అర్థంలేని విమర్శలతో వారి పరువే పోతుందని ప్రజలు అనుకుంటున్నారు.

కులాలకు సంబంధించి  త్వరలో పుస్తకం రాస్తాను