ప్రేమం..మోహం..పూరి పిలాసఫీ

ఆ మధ్య రకరకాల అంశాలపై దర్శకుడు పూరి జగన్నాద్ ప్యాడ్ కాస్ట్ లు అంటూ కొన్ని ఆధునిక 'ప్రవచనాలు' వదిలారు. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.  Advertisement నిజానికి పూరి సినిమాలు అన్నింటిలో ఈ…

ఆ మధ్య రకరకాల అంశాలపై దర్శకుడు పూరి జగన్నాద్ ప్యాడ్ కాస్ట్ లు అంటూ కొన్ని ఆధునిక 'ప్రవచనాలు' వదిలారు. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. 

నిజానికి పూరి సినిమాలు అన్నింటిలో ఈ ఏటికి ఎదురీత లాంటి వ్యవహారం వుంటుంది. అమ్మ..నాన్న తమిళ అమ్మాయి నుంచి ఇడియట్…బిజినెస్ మాన్,  వరకు. అందరూ ఒకటి అనుకుంటే తాను వేరే అంటాడు పూరి.

ఆఖరికి ఇప్పుడు కొడుకు ఆకాష్ తో తీసిన రొమాంటిక్ టైలర్ కూడా అదే చెబుతోంది. మోహంలో పడి ప్రేమ అనుకుంటారు అంతా…కానీ వీళ్లు ప్రేమలో పడి మోహం అనుకుంటున్నారు…అదీ సినిమా కోర్ పాయింట్.  

ఇది చాలు సినిమాను ఎలా ప్రెజెంట్ చేసారో అన్నది పూరి మార్క్ లో ఊహించుకునేందుకు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి..పది చుంబనాలు, పాతిక కౌగిలింతలు.. మధ్యలో ముచ్చటైన పూరి మార్కు డైలాగులు. ఇదీ రొమాంటిక్ ట్రయిలర్. 

కచ్చితంగా కుర్రకారును కాలర్ పట్టుకుని థియేటర్ కు లాక్కు వచ్చేలాగే వుంది. అలా వచ్చిన వాళ్లను శాటిస్ పై చేయడం మాత్రం ఇంకా బకాయి వుండనే వుంది. వెయిట్ టిల్ 29.