ప్రిన్స్‌ను క‌లిసేందుకు బాలీవుడ్ స్టార్ల త‌హ‌త‌హ‌…

బాలీవుడ్ న‌టీన‌టులకు మ‌న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు అంటే అక‌స్మాత్తుగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మ‌హేష్‌ను క‌లిసేందుకు స‌ర‌దా ప‌డుతున్నారు. నిన్నగాక మొన్న బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ స్వయంగా మ‌హేష్ బాబు…

బాలీవుడ్ న‌టీన‌టులకు మ‌న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు అంటే అక‌స్మాత్తుగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మ‌హేష్‌ను క‌లిసేందుకు స‌ర‌దా ప‌డుతున్నారు. నిన్నగాక మొన్న బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ స్వయంగా మ‌హేష్ బాబు ఎక్కడ షూటింగ్ చేస్తున్నాడో అక్కడికి వ‌చ్చాడు. కాసేపు ఆత్మీయంగా ముచ్చటించి మ‌రీ వెళ్లాడు.

స‌రే… షారూఖ్ ఏదో అప్పటిక‌ప్పుడు వ‌చ్చిన ఆలోచ‌న‌తో క‌లిశాడులే అనుకుంటే తాజాగా బాలీవుడ్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ‌రుణ్‌ధావ‌న్ సైతం మ‌హేష్‌ను క‌లిశాడు. చాలా సేపు ముచ్చటించాడు. త‌న‌తో పాటు వ‌న్ నేనొక్కడినేలో మ‌హేష్‌తో జోడీ క‌ట్టిన కృతిస‌న‌న్ కూడా వెంట ఉంది. 

ప్రస్తుతం మ‌హేష్ సినిమా బ్రహ్మోత్సవం షూటింగ్ జ‌రుగుతున్న చోటుకే ఈ స్టార్లు వ‌చ్చి క‌లిసి వెళ్లారు. సినిమా ప్రమోష‌న్ల నిమిత్తం  హైద‌రాబాద్‌కి వ‌చ్చే బాలీవుడ్ హీరోయిన్లలో చాలా మంది మ‌హేష్‌బాబుతో ఛాన్స్ వ‌స్తే న‌టించడానికి రెడీ అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం మ‌న‌కు తెలిసిందే. అయితే ఇటీవ‌ల మ‌హేష్ ప‌ట్ల బాలీవుడ్ హీరోల్లో కూడా మ‌ర్యాద పెర‌గ‌డానికి శ్రీమంతుడు సినిమాకి వ‌చ్చిన క‌లెక్షన్లు కూడా ఓ కార‌ణం అయి ఉండొచ్చు. 

ఎప్పుడు అడిగినా బాలీవుడ్ సినిమాలలో న‌టించే ఆస‌క్తి లేద‌ని చెపుతూ వ‌స్తున్న ప్రిన్స్‌… నార్త్ స్టార్లతో దోస్తీ మ‌రింత‌గా పెరిగితే… మ‌న‌సు మార్చుకుని బాలీవుడ్ మూవీకి సై అంటాడేమో… చూద్దాం….