ఒక డిజాస్టర్..అది కూడా డైరక్టర్ వల్లనే అని తేలిన తరువాత..మరో పెద్ద హీరో పిలిచి చాన్స్ ఇవ్వడమే అద్భుతం. పైగా ఒక భాషలో సూపర్ హిట్ అయిన రెడీ మేడ్ ప్రొడక్ట్ ను తెచ్చి చేతిలో పెట్టడం అంటే మరీ లక్కీ. ఇప్పుడు ఆ విధంగా డైరక్టర్ సురేందర్ రెడ్డి వెరీ వెరీ లక్కీ. రామ్ చరణ్..దానయ్య, ఎన్వీ ప్రసాద్ కలిసిన ప్రాజెక్టును సురేందర్ రెడ్డికే అప్పగించాలని డిసైడ్ అయినట్లే.
తమిళ మాతృక థని ఒరువన్ డైరక్టర్ రాజా ఈ విషయంలో చాలా పట్టు పట్టినా ఫలితం లేకపోయింది. రైట్స్ కింద డబ్బులతోనే సెటిల్ మెంట్ జరిగిపోయింది. భవిష్యత్ లో మరో అవకాశం ఇస్తామన్న హామీ దానికి తోడయినట్లు తెలుస్తోంది. కిక్ 2 లాంటి డిజాస్టర్ తరువాత వెంటనే చాన్స్ దొరికింది సురేందర్ రెడ్డికి.
గతంలో చరణ్ అతనికి మాట ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ రెడీ మేడ్ ప్రొడక్ట్ ఎలాగూ హిట్ అవుతుంది. సురేందర్ కు మరో సినిమా మళ్లీ ఖాయం. ఆ తరువాత సంగతి అంటారా..అప్పుడు చూసుకోవచ్చు.