వారానికో రోజు బీరు తాగేస్తే… ఆడవాళ్లకు గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట. ఒక పరిశోధనలో వెల్లడైన విషయమిది. దాదాపు 1500 మంది మహిళల మీద చేసిన పరిశోధన ఫలితాలు స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్‌కేర్‌లో ప్రచురితమయ్యాయి. మధ్య వయసు మహిళల నుంచి 92 ఏళ్ల వయసున్న మహిళ వరకూ ఈ పరిశోధన కోసం ఎంచుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ గోతెన్‌బర్గ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.
అసలు బీరు తాగని వారితో పోల్చినా, బాగా బీరు తాగే ఆడవాళ్లతో పోల్చినా నెలకు రెండు లేదా వారానికి ఒకసారి తాగే ఆడవాళ్లకు హృద్రోగం వచ్చే అవకాశాలు 30శాతం తక్కువని ఈ పరిశోధన తేల్చింది. అదే సమయంలో వైన్ ఆడవాళ్లపై చూపించే ప్రభావం ఇది అనే నిర్ధారణకు ఇంకా రాలేదని ఈ పరిశోధకులు చెప్పారు.
అదే సమయంలో అత్యధికంగా స్పిరిట్స్ తీసుకునే ఆడవాళ్లకు కేన్సర్ వ్యాధి రావడానికి గుండెపోటు అవకాశాలు రావడానికి కనీసం 50శాతం ఎక్కువ అవకాశాలున్నాయని హెచ్చరించిందీ పరిశోధన.
ఏది మితంగా ఉన్నా పర్లేదు. కాని మితి మీరితేనేగా అన్ని సమస్యలూ. తాగడం మొదలుపెట్టడమే మనిషి వంతు ఆ తర్వాత మితంగా ఉంటుందని గ్యారంటీ లేనేలేదు. అందుకనీ పరిశోధనలు ఏం చెప్పినా… మన జాగ్రత్తలు మనకు ఉండాల్సిందే. ఆరోగ్యప్రదం అంటున్నారు కదాని వారానికో బీరు తాగే బదులు… అంతకు మించి ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్ధాలో, మరో పండ్ల రసాలో తాగితే అసలు ఏ గొడవా ఉండదు కదా…