‘పాండవులకు’ ప్రచారం వీక్

పాపం మంచు ఫ్యామిలీ ఏమో 'పాండవులు'సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టే ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా రూపొందిస్తోంది. మరోపక్క సినిమాకు సరియైన హైప్ తీసుకురావాలన్నది మంచు బ్రదర్స్…

పాపం మంచు ఫ్యామిలీ ఏమో 'పాండవులు'సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టే ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా రూపొందిస్తోంది. మరోపక్క సినిమాకు సరియైన హైప్ తీసుకురావాలన్నది మంచు బ్రదర్స్ ప్రయత్నం ప్రారంభించారు. కానీ అది మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. ముందు లోగో విడుదల చేసారు. ఆ తరువాత లోగో మార్చారు. కానీ ఆ సంగతే మీడియాలో రాలేదు. 

ప్రోమో పాట విడుదల చేసారు. మీడియాకు నేరుగా వెబ్ కు రిలీజ్ చేస్తారన్నారు. గప్ చిప్ గా యూట్యూబ్ లో విడుదల చేసారు. ఆ సంగతే మీడియాకు తెలియదు. రెండు రోజులు ఆగి మీడియాకు ఫైళ్లు పంపారు. పోనీ పాట ఎవరు రాసారు..కంపోజింగ్ వైనమేమిటి? ఇతరత్రా వివరాలే తెలియవు. పాట,,ప్రోమో అన్నది పొడి పొడి మాటలు తప్ప. ఓ పక్క మంచు ఫ్యామిలీ ఏమో రామోజీ ఫిల్మ్ సిటీలో వర్మ సినిమా వ్యవహారాలతో వీర బిజీగా వుంది. 

మరోపక్క 'పాండవులు' విడుదలకు పట్టుమని రెండు వారాలు కూడా లేదు. ఇంతవరకు గట్టిగా ఒకటి రెండు స్టిల్స్ మించి విడుదల చేయలేదు. వాల్ పేపర్స్ లేవు. మరి అభిమానులకు ఏముంటుంది హడావుడి. పూరి హార్ట్ ఎటాక్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వర్కింగ్ స్టిల్స్, రెండు ప్రోమోలు వచ్చేసాయి.  అదే సమయంలో 31న మరిన్ని సినిమాలు వుండే అవకాశం వుంది. ఇప్పటికైనా మంచు ఫ్యామిలీ, వర్మ సంగతి తరువాత, ముందు ఈ సినిమా సంగతి చూసుకునిమోషన్ జోరు చేయకుంటే, ఇబ్బంది పడాలి. 

ఈ విషయాన్నే విష్ణు దగ్గర ప్రస్తావిస్తే, తాము వర్మ సినిమాలో హడావుడిలో వున్నామని, తమ వ్యవహారాలు చూసేందుకు ఓ కార్పొరేట్ పీఆర్ ను నియమించామని, త్వరలో ఆమె ఆ వ్యవహారాలు అన్నీ చూస్తుందని చెప్పుకొచ్చాడు. బెటర్ లేట్ దేన్ నెవ్వర్ విష్ణు..​