మెగా హీరోల్ని తన సినిమా కోసం బీభత్సంగా వాడుకొంటున్నాడు వైవిఎస్ చౌదరి. ఈ సినిమా వెనుక పవన్ కల్యాణ్ సపోర్ట్ కావల్సినంత ఉంది. బన్నీని కూడా రంగంలోకి దింపేశాడు. అతని చేతుల మీదుగా ఏ టూ జెడ్ లుక్ విడుదల చేశారు.
త్వరలో పవన్ చేత ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కథానాయకుల్ని కాస్త మెప్పించి… మరోసారి మెగా హీరోలతో సినిమా చేయాలని ప్లాన్ వేస్తున్నాడని టాక్. రేయ్ కథ రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసుకొన్నా – అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం తెలియందికాదు.చరణ్‌తో ఓ సినిమా చేయాలని వుంది…. అని పరోక్షంగా చెప్పడమే.
బన్నీ అయినా ఫర్లేదు… మొత్తానికి మెగా హీరో అయితే చాలు.. అనుకొంటున్నాడు. మొదట పవన్ అనుకొన్నాడు. కుదర్లేదు. ఇప్పుడు చెర్రీ బన్నీలలో ఒక్కడైనా చాలు అనుకొంటున్నాడట. రేయ్ సినిమా హిట్టయితే చౌదరి కోరిక నెరవేరుతుంది. ఫ్లాప్ అయితే అల్లు శిరీష్ కూడా తప్పించుకొని తిరుగుతాడు. ప్చ్… సినిమా పరిశ్రమలో ఇంతే.