పూరి హీరోలు ఎలా వుంటారో జనానికి బాగా తెలుసు

దర్శకుడిని బట్టి హీరో క్యారెక్టర్‌ ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్‌ హీరోలను మలిచే విధానం విచిత్రం. వాస్తవానికి ఆమడ దూరంలో వుంటాయవి. అలాంటి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తే కథలో ఆయన…

దర్శకుడిని బట్టి హీరో క్యారెక్టర్‌ ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్‌ హీరోలను మలిచే విధానం విచిత్రం. వాస్తవానికి ఆమడ దూరంలో వుంటాయవి. అలాంటి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తే కథలో ఆయన పాత్ర ఉదాత్తంగా వుంటుందా? రవితేజ, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ లాంటి హీరోల ఇమేజ్‌ వేరు. మెగాస్టార్‌ చిరంజీవి ఇమేజ్‌ వేరు. 

ఆయన రాజకీయ రంగంలో సుదీర్ఘ కాలం గడిపి, మళ్ళీ సినిమా చేస్తున్నాడంటే ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. కమిషనర్‌ కూతుళ్ళకు మొగుళ్ళు రారా? నేను కొడితే అదోలా వుంటుందని అందరూ చెబుతారు.. నేను కమిటయితే నా మాట నేనే వినను, ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చాను.. లాంటి చిల్లర డైలాగులు మెగాస్టారకి సూటవుతాయా ఇప్పుడు.? 

అస్సలు పూరి జగన్నాథ్‌ తయారు చేసే హీరో పాత్రలన్నీ ఊర మాస్‌ టైప్‌లో వుంటాయి. మెగాస్టార్‌కి సినిమాల పరంగా వున్న ఇమేజ్‌తో ‘ఆటో జానీ’ అంటూ మళ్ళీ బీడీ వెలిగించి, ఏంటీ మీటర్‌ నువ్వేసుకుంటావా? నన్నెయ్యమంటావా? అని హీరోయిన్‌తో హీరో చెప్పాడనుకోండి.. సినిమా ఎక్కడికి వెళుతుందో అర్థం కాదు. చూద్దాం.. ఆ వైనం కూడా.