Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి జగన్నాధ్ 'రోగ్'

పూరి జగన్నాధ్ 'రోగ్'

నెగిటివ్ టైటిల్స్ పెట్టమంటే, దర్శకుడు పూరి జగన్నాధ్ తరువాతే ఎవరైనా. ఇడియట్ , పోకిరి, టెంపర్, లోఫర్, అంటూ..ఒకటి రెండు కాదు..ఎన్నో.

ఇప్పుడు మరో టైటిల్ డిసైడ్ చేసాడు. రోగ్ అంటూ..ఈ టైటిల్ ఎవరికోసమో కాదు..మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్ గౌడ కోసం. ఇది అతగాడిలాంచింగ్ వెంచర్.

ఎందర్నో సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసిన పూరి చేతిలో వుంచారు ఈ కుర్రాడి తొలిసినిమాను. ప్రస్తుతం వరుణ్ తేజతో లోఫర్ సినిమా చేస్తున్నారు పూరి జగన్నాథ్. అది త్వరలో పూర్తయిపోతుంది. ఆ వెంటనేఈ వెంచర్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా ఇటు తెలుగు, అటు కన్నడ భాషల్లో రూపొందితుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?