దర్శకుడు పూరి జగన్నాధ్ వ్యవహారం అంతా వేరు. ఒకేసారి వంద పనులు చేసే టైపు. లోఫర్ సినిమాతో బిజీగా వుంటూ కూడా మహేష్ కోసం ఓ మాంచి కథ రెడీ చేసేసాడట. ఇవ్వాళో రేపో హైదరాబాద్ తిరిగి వస్తున్నాడు. వస్తూనే చేసే ఫస్ట్ పని మహేష్ కు కథ వినిపించడమే.
Advertisement
ఈ మేరకు మహేష్ అపాయింట్ మెంట్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. పూరి లాంటి దర్శకుడు కథ వినమని అడిగితే ఎందుకు కాదంటాడు. ఏ దర్శకుడి దగ్గర ఏ కథ వుంటుందో? వినడానికి ఏం పాయె. బాగుంటే చేయచ్చు..లేదంటే నో అనేయచ్చు.
అయినా పూరి మాత్రం తక్కువ వాడా? మహేష్ కు ఏది నప్పుతుందో, ఏది నచ్చుతుందో తెలియకుండా రంగంలో దిగుతాడా? ఊ అనిపించుకొకుండా బయటకు వస్తాడా? చూడాలి. ఏం జరుగుతుందో?