పూరి ఖాతాలో మరో డిజాస్టర్

పూరి యూనిట్ నుంచి వచ్చిన దర్శకుడు. పూరి సోదరుడు. పూరి రాసిన ప్రేమకథ. మరి దాని తాలూకా రియాక్షన్లు కూడా పూరి ఖాతాలో పడకుండా ఎలా వుంటాయి? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అని…

పూరి యూనిట్ నుంచి వచ్చిన దర్శకుడు. పూరి సోదరుడు. పూరి రాసిన ప్రేమకథ. మరి దాని తాలూకా రియాక్షన్లు కూడా పూరి ఖాతాలో పడకుండా ఎలా వుంటాయి? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అని సామెత వుంది. పూరి ఈ సినిమాను తయారు చేసిన తీరు అలాగే వుంది. పూరి సినిమాలు ఎంత టేకిట్ ఈజీగా తీసుకుంటాడో అన్న సంగతి తెలిసిందే. 

దాదాపు ప్రతి హీరో పూరి బారిన పడినవారే. ఎన్టీఆర్ ఆంధ్రావాలా, రవితేజ దేవుడు చేసిన మనుషులు, రానా నేను నా రాక్షసి, బన్నీ ఇద్దరమ్మాయిలతో, పవన్ కెమేరా మెన్ గంగతో రాంబాబు కొన్ని ఉదాహరణలు మాత్రమే. మహేష్ పేరు కూడా ఈ జాబితాలో వుండేదే కానీ, దూకుడు ఫోర్సుకు బిజినెస్ మెన్ లాగేసింది. అల్లు అరవింద్, మెగాస్టార్ వుండబట్టి, రామ్ చరణ్ రెండో అవకాశం ఇవ్వలేదు. లేకుంటే అతగాడి పేరు కూడా చేరిపోయేది. 

ఇలా ఇంతమంది హీరోలకు వీర ఫ్లాపులిచ్చిన పూరి తమ్ముడిని మాత్రం ఎందుకు వదిలేస్తాడు. అందుకే రోమియో స్క్రిప్ట్ ఇచ్చాడు. సినిమా నిర్మాణదశలోనే అసలు ప్రొడ్యూసర్ వ్యవహారం గమనించి చేతులెత్తేసారని వినికిడి. చాలా మందికి అప్రోచ్ అయినా ఫలితం లేకపోయింది. ఆఖరికి పాపం టచ్ స్టోన్ దొరైస్వామి దొరికిపోయారు. మధ్యలో మధురశ్రీధర్ ది కాస్త ఎంబ్రాసింగ్ సిట్యువేషన్. ఇప్పుడు ఎన్టీఆర్ కు, బండ్ల గణేష్ కు కాస్త టెన్షన్ వాళ్ల సినిమాను ఏం చేస్తాడో పూరి అని.