రచయితలు అవకాశం వస్తే దర్శకులుగానూ తమ ప్రతిభ చూపించగలరని జంధ్యాలతో ప్రూవ్ అయ్యింది. అలా ఎంతోమంది రచయితలు దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా వస్తున్న చిత్రానికి శ్రీధర్ సీపాన అనే రచయితను దర్శకుడిగా ఎంచుకున్నారు.
ఈయన సునీల్ నటించిన పలు చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపడుతున్న ‘లౌక్యం’ సినిమాకు కథ, మాటలు సమకూర్చింది శ్రీధర్ సీపానే. మంచి కామెడీ సెన్స్ వున్న రచయితగా పేరు రావడంతో ఇప్పుడు దర్శకుడిగా అవతారమెత్తుతున్నాడాయన.
‘లౌక్యం’ సినిమాకి మొదట్లో వీరభద్రం చౌదరిని దర్శకుడిగా నియమించాలని ఈ రచయిత ప్రయత్నించాడు. అప్పటికి ‘భాయ్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆయన్ని తొలగించి శ్రీవాసుని దర్శకుడిగా తీసుకున్నారు. సరైన సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతున్న గౌతమ్‌కు చక్కని కథ, కథనాలు రెడీ చేసుకున్న శ్రీధర్ సీపాన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఏ కథనైనా కామెడీతో చెబితే లైక్ చేస్తారని చెబుతున్న శ్రీధర్ సీపాన, మంచి డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటాననే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.