దాదాపు మూడేళ్లు అవుతోంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ముంబాయికి దాదాపుగా షిఫ్ట్ అయిపోయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తరువాత ఆయన లైగర్ సినిమా ప్రారంభిస్తూనే ముంబాయి వెళ్లి రావడం ప్రారంభించారు.
కానీ కోవిడ్ కారణంగా ముంబాయిలో వుండిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత లైగర్ సినిమా పనుల మీద పూర్తిగా అక్కడే వుండిపోయారు. లైగర్ షూట్ అంతా దాదాపు అక్కడే జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పూరి అండ్ టీమ్ ముంబాయి లైఫ్ కు ట్యూన్ అయిపోయారు. అలవాటు పడిపోయారు.
కానీ విషయం అది కాదు. కేవలం ఈ మూడేళ్లలో పూరి అండ్ టీమ్ అంతా ముంబాయిలో వుండడానికి, హోటళ్ల ఖర్చులకు,ఫ్లయిట్ ఖర్చులకు, ఇతర మెయింట్ నెన్స్ కు కలిపి కోట్లలో ఖర్చు అయిందన్నది. లైగర్ బడ్జెట్ లో ఇది కూడా యాడ్ అయిందట.
పూరి టీమ్ ముంబాయి ఖర్చు ను టాలీవుడ్ లో కాస్త ఎక్కువగానే చెప్పుకుంటున్నారు. అయితే అంత అయి వుంటుందా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
గత మూడేళ్లలో పూరి టీమ్ ముంబాయి ఖర్చే 20 కోట్ల వరకు అయిందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. అంటే దాదాపు నెలకు అరకోటికి పైనే అన్నమాట. ముంబాయి రేట్లు, హోటళ్లు, విలాసాలు, స్పెషల్ ఫ్లయిట్లు అన్నీ తలుచుకుంటే అదేమీ పెద్ద మొత్తం కాదు అనిపిస్తుంది.
కానీ ఇదంతా ఓ సినిమా మీదే పడుతుంది అని అనుకుంటే అంత అయి వుంటుందా అన్న అనుమానం వస్తుంది. మొత్తానికి పూరి ఏం చేసినా విలక్షణంగానే వుంటుంది.