పూరి జగన్నాధ్ తరుపున వకాల్తా తీసుకున్నట్లు అన్నీ చెప్పేస్తోంది చార్మీ. నితిన్ సినిమా ఎందుకు ఆగిపోయింది..చిరంజీవి సినిమా వుంటుందా వుండదా…ఇలా చార్మికి ప్రమేయం లేని ప్రశ్నలకు కూడా ఆమె సమాధానాలిస్తోంది. అది కూడా అథెంటిక్ గా చెప్పేస్తోంది.
నితిన్ కాంపౌండ్ లో ప్రస్తుతం కాసుల కటకట వుండడం వల్లనే పూరితో సినిమా ఆగిపోయిందని చెబుతోంది. మెగాస్టార్-పూరి సినిమా వుంటుదని కూడా అంటోంది. అడిగేవాళ్లు సరే, పూరితో చార్మీకి సాన్నిహిత్యం వుందని భావించి అడిగివుండోచ్చు.
మరి వాటికి సమాధానాలు ఇవ్వడం ద్వారా, చార్మి, ఆ సాన్నిహిత్యం నిజమే అని చాటి చెబుతున్నట్లుంది. ఇకపై నిర్మాతగా కొనసాగుతానంటోంది. అంటే ఆ లైన్ బాగుందని ఫిక్సయిపోయిందన్నమాట చార్మి.