రాజా రవీంద్ర అక్కడ సక్సెస్

రాజా రవీంద్ర హీరో అవుదామని, మంచి నటుడు అనిపించుకుందామని వచ్చాడు ఫీల్డ్ కు. నటుడు అయ్యాడు కానీ హీరో కాలేకపోయాడు. కానీ మరో ఫీల్డ్ లో విజయం సాధించాడు. హీరోలకు మేనేజర్ గా, డేట్లు…

రాజా రవీంద్ర హీరో అవుదామని, మంచి నటుడు అనిపించుకుందామని వచ్చాడు ఫీల్డ్ కు. నటుడు అయ్యాడు కానీ హీరో కాలేకపోయాడు. కానీ మరో ఫీల్డ్ లో విజయం సాధించాడు. హీరోలకు మేనేజర్ గా, డేట్లు చూడడంలో తనను మించిన వాడు లేడన్నట్లు ప్రతిభ కనబరుస్తున్నాడని టాలీవుడ్ టాక్. 

రాజా రవీంద్ర ఇప్పుడు పలువురు హీరోల డేట్లు చూస్తున్నారు. సునీల్, నిఖిల్, లకు సినిమా సెట్టింగ్ లు, డేట్లు చూసేది రాజా రవీంద్రనే. ఇప్పుడు  సునీల్ తో సెట్ కాని, కన్నప్ప సినిమాను విష్ణు దగ్గరకు చేర్చింది రాజా రవీంద్రే అంటున్నారు. 

రాజా రవీంద్ర దగ్గరకు వచ్చాక నిఖిల్ కు మూడు మంచి ప్రాజెక్టులు  వచ్చాయి. ఇప్పుడు కోన వెంకట్ ది సెట్ అయింది. సునీల్ కూడా ఇటీవల చకచకా సినిమాలు సైన్ చేసాడు. ఇక విష్ణు ఎలాగూ ఎక్కువ స్వంత బ్యానర్ నే కాబట్టి అక్కడ రవీంద్రకు అంతగా పని వుండకపోవచ్చు. ఈ లెక్కన నటుడిగా కాకున్నా, మేనేజర్ గా మంచి విజయాలు సాధిస్తున్నట్లున్నాడు రాజా రవీంద్ర.