పూరి తరువాత హీరో అతనేనా?

ప్రతి హీరోకి కొంత మంది దర్శకులతో పని చేయాలని వుంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో పూరీ జగన్నాథ్ పేరు కచ్చితంగా వుంటుంది. దాదాపు అందరు తెలుగు హీరోలు పూరితో పని చేసిన వారే. Advertisement…

ప్రతి హీరోకి కొంత మంది దర్శకులతో పని చేయాలని వుంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో పూరీ జగన్నాథ్ పేరు కచ్చితంగా వుంటుంది. దాదాపు అందరు తెలుగు హీరోలు పూరితో పని చేసిన వారే.

రామ్ రెండో సారి పూరితో చేస్తున్నారు. ఆ సినిమా డబుల్ ఇస్మార్ట్ మరో ఒకటి రెండు నెల్లలో జనాల ముందుకు వచ్చేస్తుంది. ఆ తరువాత ఏంటి? అదీ క్వశ్చను. ఎందుకంటే అందరు దర్శకులు ఒకటికి మించిన లైనప్ రెడీగా వుంచుకుంటున్న రోజులు కదా ఇవి.

పూరి కూడా డబుల్ ఇస్మార్ట్ తరువాత సినిమా రెడీగా వుంచుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ టైమ్ లో ఓ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో తేజు సజ్జ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కథ చెప్పడం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ హీరో చేతిలో ఒక సినిమా వుంది. తరువాత ఇంకా దర్శకులు ఎవరికీ కమిట్ కాలేదు. నిర్మాతలు అయితే లైన్ లో బాగానే వున్నారు.

అందువల్ల పూరితో సినిమా ఆలోచన అన్నది ప్రస్తుతం డిస్కషన్ లో నడుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ అయిపోతే ఆ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుంది. దానికి ముందు డబుల్ ఇస్మార్ట్ కూడా హిట్ అనిపించుకోవాల్సి వుంటుంది. అది ఎలాగూ బై డీఫాల్ట్ కండిషన్ కావచ్చు.