దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన స్వంత హీరో ఆశిష్. తొలి సినిమా ఏదో ఆడింది అంటే ఆడింది. మలి సినిమా చాలా వరకు తీసి, కోట్లు వేస్ట్ అవుతున్నా సరే, స్క్రాప్ చేసారు.
మూడో సినిమా లవ్ మీ అంటూ కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి మాంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకుని మరీ స్టార్ట్ చేసారు. గట్టి ప్రమోషన్ మొదలుపెట్టి, చటుక్కున విడుదల డేట్ వాయిదా వేసేసారు. ఇప్పుడు ఆ సినిమా క్వాలిటీ మీద కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో.
కొన్ని సీన్లు రీ షూట్ చేస్తున్నారని, కొన్ని సీన్లు మారుస్తున్నారని బోగట్టా. ఆశిష్ ను హీరోగా నిలబెట్టాలని ఫ్యామిలీ పెద్దలు శిరీష్- దిల్ రాజు పట్టుదలగా వున్నారు. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. సరైన ప్రాజెక్ట్ ను సెట్ చేయలేకపోతున్నారు. ఇండస్ట్రీలోని కొంతమంది నిర్మాతలను ఆశిష్ తో మంచి సినిమా ప్లాన్ చేయమని దిల్ రాజు అడగగా, సితార నాగవంశీ ఆ మేరకు పూనుకోవడం జరిగింది.
మరి అక్కడయినా మంచి ప్రామిసింగ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో? చూడాలి. దిల్ రాజు తలుచుకుంటే పెద్ద దర్శకుల కాంబినేషన్ పెద్ద కష్టమేమీ కాదు. కానీ వాళ్ల స్ట్రాటజీ ఎందుకో వేరుగా వుంది.