పుష్పకు మలయాళీ విలన్ ?

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా పుష్ప. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఇది. బన్నీ తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే.  Advertisement ఇప్పటికే బన్నీకి మలయాళంలో మంచి…

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా పుష్ప. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఇది. బన్నీ తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. 

ఇప్పటికే బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ వుంది. ఆ మార్కెట్ ను మరింత పెంచేలా, అలాగే కన్నడ, తమిళ, మళయాల మార్కెట్ కు ఉపయోగపడేలా ఓ నటుడిని ఈ సినిమాకు విలన్ గా తీసుకుంటున్నారు.

అతగాడు మరెవరో కాదు. మలయాళంలో విలక్షణ నటుడిగా పేరు తచ్చుకున్న ఫహద్ ఫాజిల్. ఇతగాడు రకరకాల సినిమాలు, పాత్రలు చేయడమే కాదు. నిర్మాత కూడా. అందుకున్న అవార్డులకు లెక్కలేదు.

ఇలాంటి నటుడిని తెలుగులోకి తీసుకురావడం మెచ్చుకోదగ్గ విషయమే. పైగా పుష్పకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ కూడా.