పివిపి కి మోకాలు అడ్డిన సురేష్

సాలా ఖడూస్ కు మాతృక తమిళ సినిమా ఇరుథి శుత్రు. ఈ సినిమాను తెలుగులో చేయాలని వెంకటేష్ అనుకున్నాడు. మాధవన్ పోషించిన బాక్సింగ్ గురు పాత్ర. ఈ సినిమా మాతృక నిర్మాతలతో కలిసి పివిపి…

సాలా ఖడూస్ కు మాతృక తమిళ సినిమా ఇరుథి శుత్రు. ఈ సినిమాను తెలుగులో చేయాలని వెంకటేష్ అనుకున్నాడు. మాధవన్ పోషించిన బాక్సింగ్ గురు పాత్ర. ఈ సినిమా మాతృక నిర్మాతలతో కలిసి పివిపి సంస్థ తెలుగులో ఆ సినిమాను నిర్మించాల్సి వుంది. ఆ మేరకు ఆ సంస్థతో పివిపి సంస్థ అధినేత పివిపి కి అగ్రిమెంట్ వుంది.  వారం పది రోజుల క్రితం వరకు అదే నడిచింది. కానీ ఈ మధ్యలో మరేమయిందో? ఇప్పుడు తమిళ మాతృక నిర్మాతలే ఫైనలైజ్ అయ్యారు. పివిపి పేరు మాయం అయింది. పైగా సురేష్ బ్యానర్ జోడిస్తారు అనుకుంటే, అదీ లేదు. 

దీని వెనుక కాస్త గట్టి వ్యవహారమే నిడచింది అని వినికిడి. పివిపి నిర్మాతగా వెంకీతో సినిమా చేయడానికి ఆయన సోదరుడు సురేష్ బాబు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. మరి పివిపి అంటే ఎందుకు సురేష్ బాబుకు కుదరలేదో తెలియదు. దీని మీద చాలా మల్లగుల్లాలు నడిచాయి. ఆఖరికి తెరవెనుక తెలుగు సినిమాలో ప్రాఫిట్ ను పివిపికి ఇవ్వడానికి, తమిళ నిర్మాతలే సినిమా చేసుకొవడానికి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. తమిళ సినిమా విడుదల సమయంలో పివిపి ఆదుకుని, ఏదో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దాని వల్లే ఇప్పుడు కొత్త ఎమ్ఓయు కుదుర్చుకుని, ఈ విధంగా సినిమా ఫైనలైజ్ చేసుకున్నారు. రానాతో సినిమా చేస్తున్న పివిపి అంటే మరి వెంకీ సోదరుడు సురేష్ బాబుకు ఎందుకు పడలేదు అన్నది ఇప్పటికి జవాబు తెలియని ప్రశ్న. కానీ పివిపి నిర్మాతగా వుండకపోవడానికి కారణం మాత్రం సురేష్ బాబే అని రూఢిగా తెలుస్తున్న విషయం.

వారెవా..వాటే చేంజ్ వెంకీ

వెంకీ తరువాతి సినిమా గురు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. వెంకీ లుక్ అదిరింది. మిడిల్ ఏజ్డ్ మజిల్ మన్ గా వెంకీ గెటప్ చాలా వైవిధ్యంగా వుంది. నిజానికి మాతృకలో వెంకీ గెటప్ జనాలకు తెలిసిందే, దానితో పోలికలు రాకుండా, డిఫరెంట్ గా గెటప్ ను రూపొందించగలిగారు. పైగా కాస్త నెరిసిన గెడ్డం, కాస్త మెలితిరిగిన మీసంతో వెంకీ కొత్తగా, ఆకర్షణీయంగా వున్నారు. విశాఖ, ఊటీల్లో 45 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరుపుగునే ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలవుతుంది.