టాలీవుడ్ హీరోలకు, హీరోయిన్లకు లింకులు పెడుతూ గ్యాసిప్ లు పుట్టడం అన్నది అరుదు. కానీ రానా ఇందుకు పూర్తి వ్యతిరేకం. గ్యాసిప్ లు ముందు పుట్టి, ఆపై రానాకు లింక్ లు పుడతాయేమో అనట్లుంటుంది వ్యవహారం. ఇలియానా దగ్గర నుంచి మొదలైంది. బిపాసా దగ్గరకు వెళ్లింది వ్యవహారం. ఆపై త్రిష అన్నారు. ఏకంగా పెళ్లే అనేసారు.
ఇప్పుడు న్యూరిలీజ్ పేరు కాజల్. ఈ మధ్య రానా-కాజల్ తెగ తిరగేస్తున్నారని వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఈ మధ్య ఓ స్టార్ హొటల్ లో లంచ్…ఆపై ఓ టెన్నిస్ మ్యాచ్ కు జాయింట్ అటెండెన్స్ అని టాక్ పై టాక్. చిత్రమేమిటంటే ఇద్దరు కలిసి ఒక్క సినిమా చేసిందీ లేదు..కొత్తగా బుక్కయిందీ లేదు. కానీ గ్యాసిప్ లకు మాత్రం బుక్కయిపోయారు.
అవును ఇంతకీ రానా సంగతి సరే, కాజల్ పేరు ఎలా చేరిందో ఇక్కడ. ఇంతవరకు కాజల్ పై అలాంటి టాక్ లు తక్కువ. ఎప్పుడో ప్రభాస్ ను పెళ్లిచేసేసుకుంటుంది అని పుటిన పుకార్లు తప్ప.