ఐ సినిమా కు ఆసక్తి ఎంత వుందో, దాని విడుదల అంత ప్రశ్నార్థకంగావుంది. ఒక పక్క సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదు, గ్రాఫిక్ పనులు ఇంకా పెండింగ్ లో వున్నాయి అని వినికిడి. అయితే సినిమాను ఎలాగన్నా సంక్రాంతికి తీసుకురావాలని యూనిట్ కిందా మీదా పడుతోంది.
అటు తమిళనాడులోనూ, ఇటు ఆంధ్ర, తెలంగాణల్లో కూడా థియేటర్లు బుక్ చేసి వుంచారు. స్క్రీన్ల సంగతి తరువాత, ముందు సోలోగా దొరికిన థియేటర్లు అన్నీ బుక్ చేసినట్లు తెలిసింది.
థియేటర్లకు అయితే తొమ్మిది లేదా ఫధ్నాలుగు అని డేట్లు చెప్పారు. తొమ్మిది డేట్ ఇచ్చారంటే, కనీసం వారం రోజులు డిలే అయినా 14కు కన్ఫర్మ్ గా వస్తుందనుకోవాలి. కానీ సినిమా వర్గాల బోగట్టా ప్రకారం విడుదల కష్టమనే అంటున్నారు. ఎందుకంటే పెండింగ్ లో వున్న పనుల సైజ్ అలాంటిది అని అంటున్నారు.