ఎన్టీఆర్, పూరి జగన్నాథ్‌ల ‘టెంపర్’ పొంగల్ రేస్‌లోంచి తప్పుకున్నట్టే. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కానీ ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా వాయిదా పడడంతో సంక్రాంతికి రావడం లేదని తేలిపోయింది. జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కావచ్చునని ఊహాగానాలు సాగుతున్నాయి కానీ అదీ జరగకపోవచ్చునని తెలిసింది.
సంక్రాంతి మిస్ అవడంతో మళ్లీ మంచి సీజన్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాలకి బెస్ట్ సీజన్ సమ్మర్ కనుక అంత వరకు ‘టెంపర్’ రాకపోవచ్చునట. సమ్మర్‌లో ఫస్ట్ బిగ్ రిలీజ్‌గా ‘టెంపర్’ రిలీజ్ కావచ్చునని సమాచారం. మార్చి 27న ‘టెంపర్’ రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువని, అంతకుముందు ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదని సినీ సర్కిల్స్ అంటున్నాయి.
దీంతో సంక్రాంతికి ‘గోపాల గోపాల’ మాత్రమే కన్‌ఫర్మ్ అయింది. శంకర్ ‘ఐ’ కూడా భారీగానే విడుదల కానుంది కనుక వేరే ఏ నిర్మాతలైనా వీటితో పోటీ పడేందుకు ముందుకొస్తారో లేదో చూడాలి.