‘లింగ’ చిత్రం మూడు రోజుల్లో వంద కోట్లు వసూలు చేసిందని తమిళ మీడియా బలంగా ప్రచారం చేస్తోంది. చాలా చిత్రాలకి జరుగుతున్నట్టే దీంట్లో కూడా ఫేక్ లెక్కలు గట్టిగానే ఉన్నాయనేది ట్రేడ్ వర్గాల టాక్. మూడు రోజుల్లో రెండు భాషల్లో కలిపి లింగ గ్రాస్ కలెక్షన్లు డెబ్బయ్ కోట్ల లోపేనట. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేయడమైతే ఖాయమే కానీ… కేవలం వంద వస్తే సరిపోదట.
ఈ చిత్రం సేఫ్ వెంఛర్ కావాలంటేనే ప్రపంచ వ్యాప్తంగా రెండొందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేయాలట. ప్రస్తుతం ఉన్న టాక్‌కి, లింగ కలెక్షన్స్ ట్రెండ్‌కి ఆ మార్కు చేరుకోవడానికి అద్భుతమే జరగాలి. ‘రోబో’ని బెంచ్ మార్క్‌గా పెట్టుకుని ఈ చిత్రంపై పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, రోబో అంతటి టాక్ రాకపోతే లింగ ఇబ్బంది పడుతుందని ముందే తెలుసని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
లింగ సబ్జెక్ట్ రొటీన్‌గా ఉండడం, రజనీ`రవికుమార్ కాంబినేషన్‌కి రజనీ`శంకర్ అంత క్రేజ్ లేకపోవడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రాక్టికల్‌గా ఇన్వెస్ట్ చేసినట్టయితే ‘తలైవా’కి తలకి మించిన భారం అయి ఉండేది కాదని, ఇప్పటికీ రజనీ స్టామినా ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చిపెట్టడం చూస్తే.. బడ్జెట్ కంట్రోల్‌లో ఉన్నట్టయితే లింగ అందరికీ సేఫ్ మూవీ అయి ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.