ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తున్న రాథేశ్యామ్ టీజర్ మరో రెండురోజుల్లో రాబోతోంది. ఫ్రభాస్ బర్త్ డే సందర్భంగా దీన్ని విడుదల చేయబోతున్నారు.
అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం దీన్ని మోషన్ పోస్టర్ అనే కన్నా టీజర్ అని కూడా అనుకోవచ్చు. సాధారణంగా మోషన్ పోస్టర్ అంటే ఓ పోస్టర్ ను బిట్ బిట్ లుగా రివీల్ చేసి, చివర్న ఫైనల్ పోస్టర్ చూపిస్తారు. అయితే రాథేశ్వామ్ మోషన్ పోస్టర్ కాస్త లెంగ్తీగానే వుంటుంది.
పోస్టర్ ఆరంభంలో ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికులను జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ పరిచయం చేస్తారని తెలుస్తోంది. అలా వెళ్లి వెళ్లి సినిమాకు కీలకమైన పామిస్ట్రీ (హస్త సాముద్రికం) సింబాలిక్ గా అరచేతిని చూపిస్తారని తెలుస్తోంది.
ఆ చెయ్యి మీదుగా కట్ చేస్తే దూరంగా కొండలు, ఆపై ఓ రైలు, ఆ రైలు లోంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీ. ఆ చున్నీని ఈ చేయి పట్టుకోవడం, ఆ వెంటనే హీరోయిన్ రైలు డోర్ దగ్గర ఫోకస్ కావడం, ఆ వెంటనే హీరో జైగాంటిక్ పర్సనాలిటీతో ఒక కాలు నేల మీద, మరో కాలు రైలు మీద వేసి కనిపించడం తో పోస్టర్ పూర్తవుతుంది.
దీనికి జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన మ్యూజిక్ సమకూర్చుతున్నారు. ప్రస్తుతం ఇటలీలో షూట్ జరుగుతోంది.