రాథేశ్వామ్ పరిస్థితి ఏమిటి?

సాహో సినిమా సెట్ మీద వుండగానే ప్రభాస్ ప్రారంభించిన సినిమా రాథేశ్వామ్. తన స్వంత బ్యానర్ గోపీకృష్ణ, తన హోమ్ బ్యానర్ యువి,  రెండూ కలిసి దీనిని నిర్మిస్తున్నాయి. సినిమా దాదాపు సగానికి పైగా…

సాహో సినిమా సెట్ మీద వుండగానే ప్రభాస్ ప్రారంభించిన సినిమా రాథేశ్వామ్. తన స్వంత బ్యానర్ గోపీకృష్ణ, తన హోమ్ బ్యానర్ యువి,  రెండూ కలిసి దీనిని నిర్మిస్తున్నాయి. సినిమా దాదాపు సగానికి పైగా పూర్తయింది. కరోనా కల్లోలం ముగిస్తే మళ్లీ షూట్ ప్రారంభించి దీనిని పూర్తి చేయాల్సి వుంది.

కానీ ఆ విషయంలో చాలా అడ్డంకులు వున్నాయన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమా చాలా వరకు వింటేజ్ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అందువల్ల మరొక్క సారి ఇటలీ వెళ్లాల్సి వుంది అని వినిపిస్తోంది. కానీ అలా వెళ్లడం కష్టం కనుక ఇక్కడే ఏదో విధంగా ఫినిష్ చేస్తారనీ టాక్ వినిపిస్తోంది. 

అయితే అది మాత్రమే కాదు, రాథేశ్వామ్ ఫినిష్ చేయడానికి ఇంకా కాస్త గట్టి మొత్తంమే కావాల్సి వుందని, ఇప్పటికే ఈ సినిమా మీద పెట్టుబడి గట్టిగా పెట్టారని, అది కాకుండా సాహో ఫైనాన్షియల్ బర్డెన్ లు కొన్ని రాథేశ్వామ్ మీదకు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇవ్ననీ ఇలా వుంచితే కరోనా కారణంగా యువి సంస్థకు థియేటర్ల ఫలితంగా గట్టి దెబ్బ తగిలింది. 

ప్రభుత్వాలు దయతలచి కరెంట్ బిల్లులు మాఫీ చేస్తే పరవాలేదు కానీ, లేదూ అంటే లక్షలకు లక్షలు కరెంటు బిల్లలు, థియేటర్ నిర్మాణ ఇఎమ్ఐ లు, అలాగే లీజు రెంట్లు కట్టాల్సి వుంటుందని టాక్. ఇవన్నీ చూసుకుని, రాథేశ్వామ్ మీద పెట్టుబడి పెట్టాలి. అదో సమస్య వుంది.

ఇదిలా వుంటే ఫిబ్రవరి నుంచి రెండునెలల్లో 15 రోజుల వంతున నాగ్ అశ్విన్ సినిమాకు ప్రభాస్ డేట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో కీలక సిజి సీన్లను ముందుగా తీసేసేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసుకున్నారు. 

వ్యాక్సీన్ వస్తే కానీ షూటింగ్ లు ప్రారంభం కావు. అంటే కనీసం అక్టోబర్ రావాల్సి వుంటుంది. ప్రభాస్ రాథేశ్వామ్ పూర్తి చేయాలి అనుకుంటే అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో చేయాల్సి వుంటుంది. లేదూ అంటే వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం వుంది.

చంద్రబాబుకి తెలంగాణాలో నోరెత్తే దమ్ములేదు